Share News

MLA Bode Prasad: నో పోలీస్‌, నో పార్టీ.. ఓన్లీ పబ్లిక్.. ఎమ్మెల్యే ఒంటరి పర్యటన

ABN , Publish Date - Nov 05 , 2025 | 03:02 PM

పార్టీ నాయకులు, కార్యకర్తలకు చెప్పకుండానే ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ఈ పర్యటన చేశారు. పార్టీ నాయకులు ఉంటే ప్రజలు తమ సమస్యలు చెప్పుకునేందుకు వీలు పడదని... అందుకే ఈ ఒంటరి పర్యటన అని ఆయన చెప్పుకొచ్చారు.

MLA Bode Prasad: నో పోలీస్‌, నో పార్టీ.. ఓన్లీ పబ్లిక్.. ఎమ్మెల్యే ఒంటరి పర్యటన
MLA Bode Prasad

కృష్ణా, నవంబర్ 5: ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ (MLA Bode Prasad) పెనమలూరు నియోజకవర్గంలో ఒంటరిగా పర్యటన చేపట్టారు. సమస్యలను ఒక్కరోజులో పరిష్కరించలేనని.. తనకున్న సమయంలో పరిష్కారం చూపుతానని ఎమ్మెల్యే చెబుతున్నారు. నో పోలీస్ .... నో పార్టీ.... ఓన్లీ పబ్లిక్ అంటూ ఎమ్మెల్యే ఒక్కరే పర్యటన సాగించారు. ఈరోజు (బుధవారం) కంకిపాడులో బుల్లెట్‌పై పర్యటించిన ఎమ్మెల్యే.. ప్రజా సమస్యలను తెలుసుకున్నారు. ఈ క్రమంలో గ్రామంలో ప్రధానంగా రోడ్, డ్రైనేజ్ సమస్యను పరిష్కరించాలని బోడె ప్రసాద్‌కు ప్రజలు విజ్ఞప్తి చేశారు. అలాగే గత ప్రభుత్వం పెన్షన్ ఆపేసిందంటూ ఒకరిద్దరు ఫిర్యాదు చేశారు.


ప్రజల సమస్యలు విన్న బోడె ప్రసాద్... అన్ని సమస్యలు ఒక్కసారి పరిష్కరించటం సాధ్యం కాదని స్పష్టం చేశారు. తనకు ఉన్న సమయంలో సమస్యలు అన్నీ పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఇప్పటికే మండల కేంద్రమైన కంకిపాడులో రూ. 2 కోట్లతో అభివృద్ధి చేశామని తెలిపారు. ప్రధాన రహదారికి ఇరువైపుల డ్రైన్ నిర్మాణంతో పాటు ప్రణాళిక బద్ధంగా గ్రామాభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చామని తెలిపారు. పలువురు స్థానికులు తనతో మాట్లాడారని... ఎమ్మెల్యే రావడం తమకు ఆనందంగా ఉందన్నారని తెలిపారు. గత ఐదేళ్లు వైసీపీ ఏమి చేయలేదని తమను మోసం చేసిందని వాపోయారని ఎమ్మెల్యే బోడె ప్రసాద్ పేర్కొన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలకు చెప్పకుండానే ఎమ్మెల్యే ఈ పర్యటన చేశారు. పార్టీ నాయకులు ఉంటే ప్రజలు తమ సమస్యలు చెప్పుకునేందుకు వీలు పడదని... అందుకే ఈ ఒంటరి పర్యటన అని ఎమ్మెల్యే బోడె ప్రసాద్ చెప్పుకొచ్చారు.


ఇవి కూడా చదవండి...

నేలపై కూర్చుని విద్యార్థులతో ముచ్చటించిన రామ్మోహన్ నాయుడు

తొమ్మిది రోజుల తర్వాత పరామర్శలా... జగన్‌పై కొల్లు రవీంద్ర సీరియస్

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 05 , 2025 | 03:56 PM