ACB Raids: ఏపీ వ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో ఏసీబీ సోదాలు
ABN , Publish Date - Nov 05 , 2025 | 03:52 PM
ఏపీలోని 120 సబ్ రిజిస్టార్ కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు చేపట్టింది. ఎన్టీఆర్ జిల్లా, కోనసీమ, ఏలూరు, ప్రకాశం, విశాఖ, నెల్లూరు, శ్రీసత్యసాయి జిల్లా, అన్నమయ్య జిల్లాల్లో ఏకకాలంలో తనిఖీలు జరుగుతున్నాయి.
అమరావతి, నవంబర్ 5: ఏపీ వ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో (Sub Registrar offices) ఏసీబీ సోదాలు (ACB Raids) చేపట్టింది. మొత్తం 120 చోట్ల ఏసీబీ తనిఖీలు కొనసాగుతున్నాయి. ఎన్టీఆర్ జిల్లా, కోనసీమ, ఏలూరు, ప్రకాశం, విశాఖ, నెల్లూరు, శ్రీసత్యసాయి జిల్లా, అన్నమయ్య జిల్లాల్లో ఏకకాలంలో రైడ్స్ జరుగుతున్నాయి. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఏసీబీ అధికారులు ఈ మేరకు సోదాలు చేపట్టారు. రిజిస్ట్రేషన్ పత్రాలు, రికార్డులను పరిశీలిస్తున్న అధికారులు.. అనుమానాస్పదంగా ఉన్న ఫైళ్లను స్వాధీనం చేసుకున్నారు.
ప్రకాశం జిల్లాలోని ఒంగోలు రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఏసీబీ అధికారులు రావడం చూసిన కొంత మంది సిబ్బంది.. తమ తమ జేబుల్లో ఉన్న నగదు బయటకు విసిరేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు.
విశాఖపట్నంలోని సబ్ రిజిస్టర్ కార్యాలయాలపై ఏసీబీ ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. మధురవాడ, భోగాపురం, టర్నర్ చౌల్ట్రీతో పాటు సబ్ రిజిస్టర్ కార్యాలయాలపై ఏసీబీ సోదాలు చేస్తోంది. ఉన్నతాధికారుల నుంచి వచ్చిన ఆదేశాల మేరకే ఈ ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నట్లు సమాచారం.
శ్రీ సత్యసాయి జిల్లాలోని చిలుమత్తూరు సబ్ రిజిస్టర్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు రైడ్స్ చేశారు. ఇటీవల కాలంలో సబ్ రిజిస్టర్‌పై పలు ఫిర్యాదులు వెళ్లడంతో ఏసీబీ రంగంలోకి దిగింది. కార్యాలయం తలుపులు మూసివేసి మరీ ఏసీబీ అధికారులు విచారణ జరుపుతున్నారు.
ఎన్టీఆర్ జిల్లాలోని ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు నిర్వహించింది. సబ్ రిజిస్టర్ కార్యాలయంలో డాక్యుమెంట్స్ ఏసీబీ డీఎస్పీ బీవీ రావు తనిఖీ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి...
తొమ్మిది రోజుల తర్వాత పరామర్శలా... జగన్‌పై కొల్లు రవీంద్ర సీరియస్
నో పోలీస్, నో పార్టీ.. ఓన్లీ పబ్లిక్.. ఎమ్మెల్యే ఒంటరి పర్యటన
Read Latest AP News And Telugu News