Share News

Jowar vs Ragi Roti: జొన్న రొట్టె V/S రాగి రొట్టె.. ఏది బరువు తగ్గిస్తుంది..?

ABN , Publish Date - Oct 26 , 2025 | 11:25 AM

జొన్న రొట్టె, రాగి రొట్టె రెండింటిలోనూ ఫైబర్, ప్రోటీన్, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చాలా సేపు మన కడుపు నిండినట్లు అనిపించేలా చేసి అనవసరమైన వాటిని తినకుండా మనల్ని కంట్రోల్ చేస్తాయి.

Jowar vs Ragi Roti: జొన్న రొట్టె V/S రాగి రొట్టె.. ఏది బరువు తగ్గిస్తుంది..?
Jowar vs Ragi Roti

ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుత సమాజంలో బరువు తగ్గటానికి వివిధ ప్రయత్నాలు చేస్తుంటారు. కొందరు జిమ్‌లు చేస్తూ.. డైట్ మెయింటైన్ చేస్తూ.. బరువు తగ్గటానికి తీవ్రంగా కష్టపడుతారు. మరికొంతమంది వారికి ఇష్టమైన ఆహారం కూడా తినకుండా.. బరువు తగ్గటానికి ఉపయోగపడే ఆహారం మాత్రమే తీసుకుంటూ.. బరువు తగ్గే ప్రయత్నం చేస్తారు. కాగా, ఈ మధ్య కాలంలో ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా బరువు తగ్గటానికి వారు తినే ఆహారంలో మాత్రం ఒక్కపూటైనా జొన్న రొట్టె లేదా రాగి రొట్టె తింటున్నారు.

పొట్ట రాకూడదని, రాత్రి సమయంలో జీర్ణం త్వరగా అవుతుందని ప్రతి ఒక్కరూ రొట్టె తినడాన్ని అలవాటుగా చేసుకున్నారు. అయితే.. జొన్న రొట్టె, రాగి రొట్టెలు రెండూ బరువు తగ్గించడానికి ఉపయోగడుతాయి. కానీ ఈ రెండు రొట్టెల్లో.. ఏది ఎక్కువ బరువు తగ్గిస్తుందనేది చాలా మంది ప్రశ్న. జొన్న రొట్టె, రాగి రొట్టె రెండు మంచివే అయినప్పటికీ బరువు తగ్గించడంలో ఏది బాగా పనిచేస్తుందో తెలుసుకుందాం..


జొన్న రొట్టె, రాగి రొట్టె రెండింటిలోనూ ఫైబర్, ప్రోటీన్, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చాలా సేపు మన కడుపు నిండినట్లు అనిపించేలా చేసి అనవసరమైన వాటిని తినకుండా మనల్ని కంట్రోల్ చేస్తాయి. ఆరోగ్యంగా ఉండేలా చేయడమే కాకుండా, ఆరోగ్యకరమైన జీవక్రియకు దోహదం చేస్తాయి. జొన్న రొట్టెలో తక్కువ క్యాలరీలు ఉంటాయి. ఇది త్వరగా జీర్ణం అవుతుంది. దీని వల్ల అధికంగా ఆహారం తీసుకోవడం జరగదు. ఇది మన బరువు తగ్గడానికి దోహదం చేస్తుంది.


రాగి రొట్టె విషయానికి వస్తే.. రాగి రొట్టెల్లో ఎక్కువ ఫైబర్, ప్రోటీన్లు ఉంటాయి. ఇవి మన బరువు తగ్గడానికి సహాయం చేస్తాయి. ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల రాగి రొట్టెలు తింటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. రాగులలో క్యాల్షియం ఎక్కువగా ఉండటం వల్ల మన ఎముకల ఆరోగ్యానికీ మంచి జరుగుతుంది. అయితే జొన్న రొట్టె, రాగి రొట్టె విషయానికి వస్తే ఈ రెండు రొట్టెల్లో బరువు తగ్గడానికి ఏది మంచిది అంటే జొన్న రొట్టె ఉత్తమమైనదని నిపుణులు చెబుతున్నారు. దీనిలో క్యాలరీలు తక్కువగా ఉండటం వల్ల రాగి రొట్టె కంటే జొన్న రొట్టె తిన్నవారు త్వరగా బరువు తగ్గుతారని అంటున్నారు. ఇది ప్రభావవంతంగా బరువును తగ్గించడానికి దోహదం చేస్తుందని నిపుణులు వెల్లడిస్తున్నారు.


ఇవి కూడా చదవండి..

Investment in Adani Raises: జీవిత బీమా..అదానీకి ధీమా

Congress Demands: పీఏసీ దర్యాప్తు జరగాలి కాంగ్రెస్‌

Updated Date - Oct 26 , 2025 | 08:37 PM