Chanakya Niti: ఈ అలవాట్లు ఉంటే దరిద్రం తప్పదు.. చాణక్యుడి హెచ్చరిక!
ABN , Publish Date - Sep 07 , 2025 | 08:39 PM
ఆచార్య చాణక్యుడు ఒక వ్యక్తి జీవితంలో విజయం సాధించేందుకు ఏం చేయాలో స్పష్టంగా వివరించాడు. ఎలాంటి నియమాలు పాటిస్తే ధనవంతులుగా ఉంటారో కూడా చెప్పారు. ఒక వ్యక్తి డబ్బు సమస్యలు ఎప్పటికీ రాకుండా ఉండాలంటే ఈ 5 అలవాట్లు వదులుకోవాల్సిందేనని అంటున్నాడు. లేకపోతే ఎంత సంపద ఉన్నా దరిద్రులు కాక తప్పదని హెచ్చరిస్తు్న్నాడు.
ప్రతి ఒక్కరూ జీవితంలో విజయం సాధించాలని , ధనవంతులు కావాలని, ఏ చీకూ చింతా లేకుండా సంతోషంగా జీవించాలని కోరుకుంటారు. ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో మానవ జీవితానికి సంబంధించిన ఈ రహస్యాలను వివరించాడు. ఒక వ్యక్తి అనుకున్న లక్ష్యం సాధించడానికి ఏ అలవాట్లను అలవర్చుకోవాలో చెప్పినట్టుగానే.. ఏ అలవాట్లు వదిలించుకోవాలో కూడా నీతిశాస్త్రంలో స్పష్టంగా వివరించాడు. ఈ కింది అలవాట్లు ఒక వ్యక్తిని పేదరికంలోనే ఎందుకు ఉంచుతాయో కూడా చెప్పాడు. కాబట్టి, చాణక్యుడు చెప్పినట్లుగా మనకు అతిపెద్ద శత్రువు అయిన ఆ చెడు అలవాట్లు ఏమిటో చూద్దాం.
ఒక వ్యక్తిని పేదవాడిగా మార్చే అలవాట్లు ఇవే
1.సంధ్యా సమయంలో నిద్రపోయే అలవాటు
సూర్యాస్తమయ సమయాన్ని చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు. ఆచార్య చాణక్యుడి ప్రకారం, సూర్యాస్తమయ సమయంలో నిద్రపోయేవారు పేదవారే. ఈ సమయం లక్ష్మీ దేవిని పూజించే సమయం అని.. ఈ సమయంలో నిద్రించే వారికి లక్ష్మీదేవి ఆశీస్సులు ఎప్పటికీ లభించవని.. జీవితాంతం పేదవారే ఉంటారని చాణక్యుడు హెచ్చరిస్తున్నాడు.
2.సోమరితనం
సోమరితనం మనిషికి అతిపెద్ద శత్రువు. స్వతహాగా సోమరితనం ఉన్నవారు భూమికి భారం అని చాణక్యుడు చెప్పాడు. సోమరిగా ఉండేవారు ఎప్పుడూ పనులు వాయిదా వేస్తుంటారు. లక్ష్యంపైన శ్రద్ధ వహించరు. అందుకే జీవితంలో ఎప్పటికీ విజయం సాధించలేరు. కాబట్టి, సోమరితనాన్ని వదులుకోవడం ద్వారానే జీవితంలో ఏదైనా సాధించగలడు.
3.మురికిగా ఉండటం
మురికిలో నివసించేవారు ఎల్లప్పుడూ పేదవారిగానే ఉంటారని చాణక్యుడు చెప్పాడు. చాణక్యుడి ప్రకారం, మురికిగా ఉన్నవారిని, శుభ్రమైన బట్టలు ధరించనివారిని లేదా తమ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోనివారిని లక్ష్మీదేవి ఇష్టపడదు. అలాంటి వ్యక్తులు ఎల్లప్పుడూ పేదరిక జీవితాన్ని గడుపుతారు. వారు జీవితంలో ఏమీ సాధించలేరు. కాబట్టి, ప్రజలు వెంటనే ఈ అలవాటును వదులుకోవాలి. లేకుంటే వారి పతనం ఖాయం అని చాణక్యుడు చెప్పాడు.
4.అధికంగా ఖర్చు చేసేవారు
ఖర్చును నియంత్రించుకోని వ్యక్తులు త్వరగా పేదలుగా మారతారు. ఆదాయం కంటే ఎక్కువ డబ్బు ఖర్చు చేసేవారు ఏదో ఒక రోజు పేదలుగా మారడం ఖాయం అని చాణక్యుడు చెప్పాడు. కాబట్టి, అవసరానికి అనుగుణంగా మితంగా ఖర్చు చేయడం మంచిది.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)
Also Read:
క్యాన్సర్ నుంచి డయాబెటిస్ వరకు.. మందులపై జీఎస్టీ తగ్గింపు వల్ల లాభపడే వారు వీరే!
డైలీ టమోటాలు తింటే నిజంగా కిడ్నీలో రాళ్లు వస్తాయా?
For More Latest News