Asia Cup 2025 Gautam Gambhir: ఆసియా కప్ 2025 కోసం భారత జట్టు సిద్ధం..గంభీర్ కీలక సూచన
ABN , Publish Date - Sep 07 , 2025 | 08:22 PM
ఆసియా కప్ 2025 మళ్లీ క్రికెట్ ప్రేమికులను ఉర్రూతలూగించేందుకు సిద్ధంగా ఉంది. ఈ టోర్నీలో విజయం సాధించాలంటే ప్రతి మ్యాచ్ కీలకమవుతుంది. ఇటీవల కొత్త కోచ్‌గా బాధ్యతలు స్వీకరించిన గౌతమ్ గంభీర్ జట్టుకు కీలక సూచనలు చేశారు.
ఆసియా కప్ 2025 (Asia Cup 2025) కోసం సమయం దగ్గర పడింది. సెప్టెంబర్ 9 నుంచి ఈ ఉత్కంఠభరిత టోర్నమెంట్ ప్రారంభం కానుంది. మొదటి మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్ హాంగ్ కాంగ్‌తో తలపడనుంది. భారత జట్టు తమ తొలి మ్యాచ్‌ను సెప్టెంబర్ 10న, బుధవారం ఆతిథ్య దేశం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌తో ఆడనుంది. అయితే ఈ టోర్నమెంట్‌కు ముందు, శుక్రవారం దుబాయ్‌లో సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని భారత జట్టు శిక్షణలో పాల్గొంది. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) సమక్షంలో గంటల తరబడి జట్టు ప్రాక్టీస్ చేసింది.
గ్రూప్ Aలో భారత్
భారత జట్టు (Team India) గ్రూప్ Aలో ఉంది. ఇక్కడ UAE, పాకిస్తాన్, ఒమన్‌లతో తలపడనుంది. కానీ అందరి దృష్టి సెప్టెంబర్ 14న జరిగే పాకిస్తాన్‌తో జరిగే హై-వోల్టేజ్ మ్యాచ్‌పై ఉంది. శిక్షణ సమయంలో మా జట్టు అద్భుతంగా ఉందని భారత వైస్-కెప్టెన్ శుభ్‌మన్ గిల్ పేర్కొన్నాడు. ఈ గ్రూప్‌లో చేరడం సంతోషంగా ఉందన్నాడు. గిల్ చివరిసారిగా జులై 2024లో శ్రీలంకతో T20I ఆడాడు. ఇప్పుడు అతను భారత జట్టు వైస్-కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.
గంభీర్ సూచన
ఆసియా కప్ జట్టులో భాగమైన భారత ఆల్‌రౌండర్ శివమ్ దూబే, కోచ్ గంభీర్ చెప్పిన విషయాన్ని వెల్లడించాడు. మన దేశం తరఫున ఆడేటప్పుడు, ప్రతిసారి మీరు కొత్తగా ఏదైనా చేయడానికి అవకాశం ఉంటుందని మా కోచ్ గంభీర్ చెప్తారని దూబే పేర్కొన్నాడు.
గిల్ vs బుమ్రా
నెట్స్‌కు వెళ్లే ముందు, భారత జట్టు వార్మప్ స్ట్రెచ్‌లు చేసింది. షటిల్ రన్స్, హై నీస్, సాఫ్ట్ త్రోస్ వంటివి. నెట్స్‌లోకి అడుగుపెట్టిన గిల్, బుమ్రా పోటా పోటీగా ప్రాక్టీస్ చేశారు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, స్పోర్ట్స్ హెర్నియా సర్జరీ నుంచి కోలుకుని, తన రిథమ్‌ను తిరిగి పొందేందుకు గిల్‌తో కలిసి బ్యాటింగ్ చేశాడు.
అదే సమయంలో జితేష్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ వంటి ఆటగాళ్లు పలు బ్యాట్‌లతో సిద్ధంగా వచ్చారు. అభిషేక్ శర్మ ఆసక్తికరంగా తన బౌలింగ్ నైపుణ్యాలను ప్రదర్శించాడు. ఇక బౌలింగ్ కోచ్ మోర్న్ మోర్కెల్, శివమ్ దూబే రనప్ విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టారు.
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి