Hyundai Price Cut: హ్యుందాయ్ షాకింగ్ ప్రకటన..కార్ల ధరలు లక్షల రూపాయలు తగ్గింపు
ABN , Publish Date - Sep 07 , 2025 | 06:48 PM
మీరు కారు కొనే ప్లాన్ చేస్తుంటే, ఇది మంచి టైం అని చెప్పవచ్చు. ఎందుకంటే హ్యుందాయ్ కంపెనీ తమ కార్లపై భారీ తగ్గింపు ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల జీఎస్టీ తగ్గించడంతో ఈ ప్రయోజనాన్ని కస్టమర్లకు అందించేందుకు హ్యుందాయ్ ఈ నిర్ణయం తీసుకుంది.
మీరు కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా. అయితే, మీకు సూపర్ న్యూస్. హ్యుందాయ్ (Hyundai) మోటార్ ఇండియా అదిరిపోయే ప్రకటన చేసింది. తమ కార్ల ధరలను ఏకంగా రూ. 2.4 లక్షల వరకు తగ్గిస్తున్నట్లు తెలిపింది. ఎందుకంటే, GST రేట్లలో కేంద్ర ప్రభుత్వం తగ్గింపు చేసిన సానుకూల నిర్ణయాన్ని కస్టమర్లకు చేరవేయాలని హ్యుందాయ్ భావిస్తోంది.
ఈ వారంలో GST కౌన్సిల్ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ప్యాసెంజర్ వాహనాలపై GST రేటును 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించింది. ఈ కొత్త ట్యాక్స్ రేటు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వస్తుంది. దీంతో హ్యుందాయ్ వెంటనే ఈ బెనిఫిట్‌ను తమ కస్టమర్లకు అందించాలని నిర్ణయించింది. ఈ GST తగ్గింపు ఆటోమొబైల్ ఇండస్ట్రీకి ఓ బూస్ట్ లాంటిదని హ్యుందాయ్ మేనేజింగ్ డైరెక్టర్ ఉన్సూ కిమ్ అన్నారు. ఇది కస్టమర్లకు కార్లను మరింత తగ్గింపు ధరల్లో అందుబాటులోకి తెస్తుందన్నారు.
హ్యుందాయ్ కార్ల ధరల తగ్గింపు వివరాలు
హ్యుందాయ్ తమ దాదాపు అన్ని మోడళ్లపై ధరలను తగ్గించింది. ఇందులో ఎక్కువ తగ్గింపు టక్సన్ మోడల్‌పై రూ. 2,40,303 ఉండగా, వెర్నాపై రూ. 60,640 తగ్గింపు ఉంది. ఇతర మోడళ్లలో కూడా గణనీయమైన ధరల తగ్గింపు ఉంది.
గ్రాండ్ i10 నియోస్: రూ. 73,808
ఆరా: రూ. 78,465
ఎక్స్‌టర్: రూ. 89,209
i20: రూ. 98,053
i20N లైన్: రూ. 1,08,116
వెన్యూ: రూ. 1,23,659
వెన్యూ N లైన్: రూ. 1,19,390
వెర్నా: రూ. 60,640
క్రెటా: రూ. 72,145
క్రెటా N లైన్: రూ. 71,762
అల్కాజర్: రూ. 75,376
టక్సన్: రూ. 2,40,303
ఈ కొత్త ధరలు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వస్తాయి. అంటే, ఆ రోజు నుంచి ఈ ధరల తగ్గింపుతో హ్యుందాయ్ కార్లను కొనుగోలు చేయవచ్చు.
ఇతర కంపెనీలు కూడా రేసులో
హ్యుందాయ్ మాత్రమే కాదు, ఇతర ఆటోమొబైల్ కంపెనీలు కూడా GST తగ్గింపు ప్రయోజనాన్ని కస్టమర్లకు చేరవేస్తున్నాయి. టాటా మోటార్స్ (Tata Motors) శుక్రవారం తమ కార్ల ధరలను రూ. 1.45 లక్షల వరకు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. టాటా హ్యారియర్, సఫారీ మోడళ్లపై రూ. 1.4 లక్షలు, రూ. 1.45 లక్షల తగ్గింపు ఉండగా, టియాగో, టైగర్ మోడళ్లపై రూ. 74,000, రూ. 80,000 తగ్గింపు ఉంది.
అలాగే, మహీంద్రా అండ్ మహీంద్రా (Mahindra & Mahindra) కూడా సెప్టెంబర్ 6 నుంచి తమ కార్ల ధరలను రూ. 1.6 లక్షల వరకు తగ్గించింది. XUV3XO మోడల్‌పై రూ. 1.56 లక్షల భారీ తగ్గింపు ఉండగా, థార్ 4WDపై రూ. 1.01 లక్షల తగ్గింపు ఉంది. రెనాల్ట్ ఇండియా కూడా ధరల తగ్గింపు ప్రకటన చేసింది.
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి