Minister Nara Lokesh: ఏపీలో సంవిత్ పాఠశాల ప్రారంభించాలని లోకేశ్ వినతి..
ABN , Publish Date - Sep 07 , 2025 | 08:05 PM
ఆదిచుంచనగిరి మఠం ఆధ్వర్యంలో పాఠశాలలు, మెడికల్ కాలేజీ, ఆసుపత్రి, యూనివర్సిటీలను నిర్వహించడం గొప్ప విషయమని మంత్రి లోకేశ్ కితాబిచ్చారు. ఈ మేరకు పాఠశాలల గురించి అడిగి తెలుసుకున్నారు.
అమరావతి: కర్ణాటక రాష్ట్రం మండ్య జిల్లాలో మంత్రి నారా లోకేశ్ పర్యటించారు. ఈ నేపథ్యంలో ఆదిచుంచనగిరి మహాసంస్థాన మఠాన్ని ఆయన సందర్శించారు. క్షేత్రంలోని శ్రీకాల భైరవస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నిర్వహకులతో మాట్లాడి మఠం ఆధ్వర్యంలో చేపడుతున్న వివిధ సేవా కార్యక్రమాల గురించి తెలుసుకున్నారు. మఠం అంత తిరిగి పరిశీలించారు. ఈ క్షేత్రానికి 1,800 ఏళ్ల చరిత్ర ఉందని తెలిపారు. ఈ మేరకు మఠం 72వ పీఠాధిపతి జగద్గురు నిర్మలానందనాథ స్వామి ఆశీర్వాదం పొందినట్లు లోకేశ్ స్పష్టం చేశారు.
మఠం ఆధ్వర్యంలో పాఠశాలలు, మెడికల్ కాలేజీ, ఆసుపత్రి, యూనివర్సిటీలను నిర్వహించడం గొప్ప విషయమని మంత్రి లోకేశ్ కితాబిచ్చారు. పాఠశాలల నిర్వహణ గురించి అడిగి తెలుసుకున్నారు. పేద విద్యార్థులకు ఎలాంటి ఖర్చు లేకుండా 6వ తరగతి నుంచి ఇంటర్ వరకూ అన్ని వసతులతో కూడిన విద్యను అందిస్తున్నట్లు మఠం నిర్వాహకులు ఆయనకు చెప్పుకొచ్చారు. ఇంటర్ పూర్తయిన తరువాత ఏ రాష్ట్రంలో డిగ్రీ చదవాలనుకున్నా మఠం ఆర్థిక సహాయం అందిస్తుందని వారు వివరించారు. దీంతో ఆంధ్రప్రదేశ్‌లోనూ పేద విద్యార్థులకు ఉపయోగపడేలా సంవిత్ పాఠశాల ప్రారంభించాలని కోరినట్లు లోకేశ్ తెలిపారు. తన వినతికి పీఠాధిపతి జగద్గురు నిర్మలానందనాథ స్వామి అంగీకారం తెలిపినట్లు లోకేశ్ వెల్లడించారు.
ఇవి కూడా చదవండి..
నోట్లో యాసిడ్ పోస్తా.. బీజేపీ నేతపై రెచ్చిపోయిన టీఎంసీ ఎమ్మెల్యే
ప్రజ్వల్ రేవణ్ణకు జైలులో పని, వేతనం ఎంతంటే