Uganda Road Accident: ఘోర రోడ్డుప్రమాదం.. 63మంది దుర్మరణం..
ABN , Publish Date - Oct 22 , 2025 | 04:32 PM
ఉగాండా రాజధాని కంపాలలో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 63మంది మృతి చెందినట్లు స్థానిక అధికారులు తెలిపారు. కంపాలలో ఓ రోడ్డుపై పలు వాహనాలు పరస్పరం ఢీకొనడంతో ఈ ఘోరం చోటుచేసుకుందని అధికారులు పేర్కొన్నారు.
ఉగాండా, అక్టోబర్ 22: నిత్యం ఏదో ఒక ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. నిర్లక్ష్యం, అతివేగం, మద్యం మత్తులో డ్రైవింగ్ వంటి వివిధ కారణాలతో రోడ్డుప్రమాదాలు చోటుచేసుకుంటాయి. కొందరు డ్రైవర్లు చేసే తప్పుకు అనేక మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతుంటారు. రోడ్డుప్రమాదాల నివారణకు ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా.. ఫలితం మాత్రం ఆశించిన స్థాయిలో ఉండటం లేదు. తాజాగా ఓ ఘోర రోడ్డు(Road Accident) ప్రమాదంలో 63 మంది మృతిచెందారు. వివరాల్లోకి వెళ్తే..
ఉగాండా రాజధాని కంపాలలో ఈ ఘోర రోడ్డుప్రమాదం (Road Accident) చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 63మంది మృతి చెందినట్లు స్థానిక అధికారులు తెలిపారు. కంపాలలో ఓ రోడ్డుపై పలు వాహనాలు పరస్పరం ఢీకొనడం (Multiple Vehicle Crash in Uganda)తో ఈ ఘోరం చోటుచేసుకుందని అధికారులు పేర్కొన్నారు. మంగళవారం అర్ధరాత్రి ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. గులు ప్రాంతంలోని హైవేపై ఓ బస్సు డ్రైవర్.. లారీని ఓవర్‌టేక్ చేస్తూ ఎదురుగా వస్తున్న మరో బస్సును వేగంగా ఢీకొట్టాడు. వెంటనే డ్రైవర్ బస్సును మరో వైపునకు తిప్పాడు. అదే సమయంలో బస్సుకు పక్కనే ఎదురుగా వస్తున్న రెండు కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి.
ఇలా నియంత్రణ కోల్పోయిన పలు వాహనాలు వరుసగా ఢీకొట్టుకుని రోడ్డుపై బోల్తా పడ్డాయి. ఈ ఘటనలో స్పాట్ లోనే పలువురు మృతిచెందగా.. మరికొందరిని ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయినట్లు తెలుస్తోంది. మృతదేహాలను పోస్టుమార్టానికి, క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించామని అధికారులు వెల్లడించారు. కాగా, ఇప్పటివరకూ 63 మంది మరణించినట్లు సమాచారం. ఘటనపై కేసు నమోదు చేసిన స్థానిక పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. తమ దేశంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం ఓవర్ టేకింగ్ చేస్తుండమేనని.. వాహనదారులు రోడ్లపై తగిన జాగ్రత్తలు తీసుకోనేలా ఉగాండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
ఇవి కూడా చదవండి..
అయ్యప్ప సేవలో ద్రౌపది ముర్ము.. శబరిమలను దర్శించుకున్న తొలి రాష్ట్రపతి
Saira Banu: కడపలో ఉగ్రవాది అబూబకర్ సిద్ధికి భార్య సైరా భాను ను కస్టడీకి తీసుకున్న NIA
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి