US Gun Violence: అమెరికాలో కాల్పులు.. ముగ్గురి మృతి
ABN , Publish Date - Sep 28 , 2025 | 09:41 AM
అమెరికాలోని నార్త్ కరోలినాలో కాల్పులు జరిగాయి. కరోలినాలోని అమెరికన్ ఫిష్ కంపెనీ రెస్టారెంట్ సమీపంలో ఓ దుండగుడు బోటుపై నుంచి కాల్పులకు దిగాడు. కాల్పులు చోటుచేసుకోవడంతో అక్కడి ప్రజలు తీవ్ర భయందోళనలకు గురయ్యారు. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు.
ఇంటర్నెట్ డెస్క్, సెప్టెంబరు28 (ఆంధ్రజ్యోతి): అమెరికా (America)లోని నార్త్ కరోలినా (North Carolina)లో కాల్పులు (Gun Fire) జరిగాయి. కరోలినాలోని అమెరికన్ ఫిష్ కంపెనీ రెస్టారెంట్ సమీపంలో ఓ దుండగుడు బోటుపై నుంచి కాల్పులకు దిగాడు. కాల్పులు చోటుచేసుకోవడంతో అక్కడి ప్రజలు తీవ్ర భయందోళనకు గురయ్యారు. ఈ కాల్పుల్లో ముగ్గురు మృతి చెందారు. పలువురికి గాయాలైనట్లు తెలుస్తోంది. అయితే, కాల్పుల జరిగిన తర్వాత దుండగుడు బోటులోనే పారిపోయాడు. దుండగుడి కోసం అమెరికా పోలీసులు వెతుకుతున్నారు. దగ్గరలోని సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని అమెరికా పోలీసులు స్థానికులకు సూచించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి:
అతిగా లాబీయింగ్ చేయొద్దు.. ట్రంప్‌కు నోబెల్ కమిటీ పరోక్ష హెచ్చరిక
ఐరోపా గగనతలంలో ప్రయాణించని ఇజ్రాయెల్ ప్రధాని..అరెస్టు భయమే కారణమా..
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి