Share News

Trump Pope Comment: నాకు పోప్ కావాలనుంది.. ట్రంప్ షాకింగ్ కామెంట్స్..

ABN , Publish Date - Apr 30 , 2025 | 03:10 PM

Trump Pope Comment Reaction: పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియల అనంతరం షాకింగ్ కామెంట్లు చేశారు. నాకు తదుపరి పోప్ కావాలనుందనే వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

Trump Pope Comment: నాకు పోప్ కావాలనుంది.. ట్రంప్ షాకింగ్ కామెంట్స్..
Trump Pope Comment

Trump Pope Joke Backlash: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియల అనంతరం కాథలిక్ చర్చిని నడిపించేందుకు ఎవరికి మద్ధతిస్తారని విలేకరులు అడిగిన ప్రశ్నకు షాకింగ్ రిప్లై ఇచ్చారు. ఏ మాత్రం సంకోచం లేకుండా “నేను పోప్ అవ్వాలనుకుంటున్నాను. అదే నా నంబర్ వన్ ఛాయిస్.” అని దురుసుగా సమాధానమిచ్చి ఆశ్చర్యపరిచారు. ట్రంప్ ఈ విషయంపై మాట్లాడిన తీరు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇలా ఎలా మాట్లాడతారని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.


కొత్త పోప్ ఎంపిక గురించి జోక్ చేశానని ట్రంప్ సమాధానపర్చేందుకు ప్రయత్నించారు.ఆ తర్వాత ఆయన పోప్ ఫ్రాన్సిస్ వారసుల గురించి సీరియస్ గా మాట్లాడారు. తనకు ఎవరిపైనా ప్రత్యేకమైన అభిమానం లేదని పేర్కొంటూనే, న్యూయార్క్ ఆర్చ్ బిషప్ కార్డినల్ తిమోతి డోలన్ ఆ అత్యున్నత పదవికి "సరైన వ్యక్తి" వ్యక్తి అని పేర్కొన్నారు. అతను చాలా మంచివాడు. కాబట్టి ఏమి జరుగుతుందో చూడాలని చెప్పుకొచ్చారు.


ట్రంప్ వ్యాఖ్యలు నెట్టింట్లో తీవ్ర చర్చలకు తెరలేపాయి. చాలా మంది నెటిజన్లు ట్రంప్ మాటలను తప్పుబడుతూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ట్రంప్ హాస్యాస్పదంగా చేసినప్పటికీ, మతపెద్దలపై గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలను మళ్లీ గుర్తుచేసుకుంటున్నారు. 2016లో పోప్ ఫ్రాన్సిస్ క్రైస్తవ మతం పట్ల ట్రంప్ కున్న విశ్వాసాన్ని ప్రశ్నించినపుడు తీవ్రంగా స్పందించారు. పోప్ వ్యాఖ్యలను "అవమానకరమైనవ" అని చెప్తూ వాటికన్‌ సిటీని మెక్సికన్ ప్రభుత్వం ప్రభావితం చేస్తోందని ఆరోపించారు .


Read Also: Donald Trump:100 రోజుల్లో ట్రంప్ తుఫాన్..ఒప్పందాల నుంచి ఒడిదొడుకుల దాకా..

India Us Trade: వాణిజ్య చర్చలు బేష్... భారత్‌తో త్వరలో ఒప్పందం: ట్రంప్ కీలక వ్యాఖ్యలు

India Pakistan: టెన్షన్‌లో పాకిస్థాన్.. మరో 36 గంటల్లో..

Updated Date - Apr 30 , 2025 | 03:10 PM