India Us Trade: వాణిజ్య చర్చలు బేష్... భారత్‌తో త్వరలో ఒప్పందం: ట్రంప్ కీలక వ్యాఖ్యలు
ABN , Publish Date - Apr 30 , 2025 | 01:03 PM
India Us Trade Deal Trump Says: భారతదేశంతో వాణిజ్య ఒప్పంద చర్చలు చాలా బాగా జరుగుతున్నాయని.. రెండు దేశాలు త్వరలోనే ఒక ఒప్పందానికి వస్తాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. అన్నారు.

Donald Trump India Trade Deal: ప్రపంచ దేశాలపై టారిఫ్ బాంబు విసిరి వాణిజ్య యుద్ధానికి తెరలేపిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రస్తుతం కాస్త వెనక్కి తగ్గారు. చైనా మినహా ఇతర దేశాలపై ప్రతీకార సుంకాలను 90 రోజుల పాటు నిలిపివేశారు. చర్చల ద్వారా వ్యాపార ఒప్పందాలు చేసుకోవడంపై దృష్టి సారించారు. ఇక వైట్‌హౌస్ వెలుపల మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ, ప్రస్తుతం భారత్‌తో చర్చలు అద్భుతంగా సాగుతున్నాయని.. త్వరలోనే ఇరు దేశాలు వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునే అవకాశముందని ఆశాభావం వ్యక్తం చేశారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ, భారతదేశంతో సుంకాలపై చర్చలు గొప్పగా సాగుతున్నాయని చెప్పారు. వాషింగ్టన్ త్వరలోనే న్యూఢిల్లీతో వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకునే అవకాశముందని హింట్ ఇచ్చారు. భారత ప్రధాని మోదీతో అమెరికా పర్యటనలో ఈ విషయమై చర్చించామని గుర్తుచేశారు. ట్రంప్ భారతదేశంపై 26 శాతం పరస్పర సుంకాన్ని విధించిన సంగతి తెలిసిందే. తరువాత వాణిజ్య ఒప్పందాలపై చర్చించడానికి దానిని 90 రోజులు నిలిపివేశారు.
అంతకుముందు, అమెరికా వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ట్రంప్ ప్రభుత్వం భారతదేశంతో వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేసిందని.. ఇక భారత ప్రధానమంత్రి, పార్లమెంటు ఆమోదం కోసం వేచి చూస్తున్నామని అన్నారు. అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెస్సెంట్ కూడా అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై సంతకం చేసిన మొదటి దేశాలలో భారతదేశమే ఉండవచ్చని పేర్కొన్నారు.
ఫిబ్రవరిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటనలో అధ్యక్షుడు ట్రంప్‌తో కీలక చర్చలు జరిపారు. ఈ భేటీలో ఇరు దేశాధినేతలు వాణిజ్య ఒప్పందం, సుంకాలకు సంబంధించిన విబేధాలను పరిష్కరించుకోవాలని ఒక అంగీకారానికి వచ్చారు. ఈ సంవత్సరం చివరి నాటికి దానిని ఖరారు చేసి 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 500 బిలియన్ డాలర్లకు తీసుకెళ్లాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నరు. అయితే, ఏ ఒప్పందం దేశ ప్రయోజనాలకు భంగం కలిగించనిదిగా ఉంటేనే అంగీకరిస్తామని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది.
Read Also: India Pakistan: టెన్షన్‌లో పాకిస్థాన్.. మరో 36 గంటల్లో..
US truck driver law: అమెరికాలో ట్రక్కు డ్రైవర్లు ఆంగ్లం మాట్లాడాల్సిందే
Balochistan: పాక్‌లో షాక్.. బలూచిస్థాన్‌లో బుల్లెట్లతో చిద్రమైన ఏడు మృతదేహాలు లభ్యం