Earthquake In Pakistan: పాకిస్థాన్‌లో భారీ భూప్రకంపనలు.. భయంతో జనం పరుగులు
ABN , Publish Date - May 10 , 2025 | 12:35 PM
Pakistan: పాకిస్థాన్‌లో మళ్లీ భూప్రకంపనలు సంభవించాయి. గంటల వ్యవధిలోనే రెండోమారు పాక్‌లో భూమి కంపించింది. నిన్నటి పోలిస్తే తాజాగా భారీగా భూప్రకంపనలు సంభవించాయి.
పాకిస్థాన్‌లో మరోసారి భూప్రకంపనలు సంభవించాయి. దీంతో భయంతో ప్రజలు రోడ్ల మీదకు పరుగులు తీశారు. శుక్రవారం తెల్లవారుజామున భూమి కంపించగా.. ఒక్క రోజు వ్యవధిలోనే మళ్లీ ఇది రిపీట్ అవడంతో అక్కడి ప్రజలు భయాందోళనలకు లోనవుతున్నారు. మొదటి భూప్రకంపనల తీవ్రత 4.0 కాగా.. ఈసారి రిక్టర్ స్కేలుపై 5.7 తీవ్రతతో భూమి కంపించింది. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో ఈ భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి.
టెన్షన్.. టెన్షన్
ఆల్రెడీ భారత్ చేతుల్లో పాకిస్థాన్‌కు వరుస షాకులు తగులుతున్నాయి. అటు డిఫెన్స్‌లో, ఇటు అఫెన్స్‌లో ఫెయిలై.. ఇండియాలో చేతుల్లో చావుదెబ్బలు తింటోంది పాక్. వాళ్ల ఎయిర్‌బేస్‌లు, మిలటరీ పోస్టులు ధ్వంసమవుతున్నాయి. బాంబుల భయంతో జనాలు బిక్కుబిక్కుమంటున్నారు. ఈ తరుణంలో ఒక్క రోజు గ్యాప్‌లో రెండుమార్లు భూప్రకంపనలు సంభవించడంతో అక్కడి వారికి ఏం చేయాలో పాలుపోవడం లేదు. యుద్ధ భయంతో చస్తూ బతుకుతూ ఉంటే.. వరుస భూప్రకంపనలు రావడం వారిని మరింత కలవరానికి గురిచేస్తోంది.
తెల్లవారుజామున..
భారత్‌పై డ్రోన్ దాడులకు తెగబడుతున్న పాకిస్థాన్‌లో తొలి భూప్రకంపనలు మే 9వ తేదీ తెల్లవారుజామున సంభవించాయి. రిక్టర్ స్కేలుపై 4గా భూప్రకంపనల తీవ్రత నమోదైందని అధికారులు తెలిపారు. 1.44 గంటలకు భూమి కంపించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది. అయితే ఈ భూప్రకంపనల వల్ల ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అంటున్నారు. ఇది జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే తాజాగా మరోమారు భూప్రకంపనలు రావడంతో అక్కడి ప్రజలు భయాందోళనలకు లోనవుతున్నారు.
ఇవీ చదవండి:
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి