Share News

Jinping Meets Trump: ఆరేళ్ల తర్వాత.. నేడు భేటీ కానున్న ట్రంప్, జిన్‌పింగ్

ABN , Publish Date - Oct 30 , 2025 | 07:36 AM

గురువారం(అక్టోబర్ 30) నుంచి దక్షిణ కోరియాలోని బుసాన్ నగరంలో ఆసియా- పసిఫిక్ ఎకనామిక్ కో ఆపరేషన్(అపెక్) సదస్సు జరుగుతుంది. ఈ సమావేశానికి పలు దేశాధినేతలు హాజరు కానున్నారు. ఈ సదస్సుకు అనుబంధంగా జిన్ పింగ్ తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతామని అమెరికా తెలిపింది.

Jinping Meets Trump: ఆరేళ్ల తర్వాత.. నేడు భేటీ కానున్న ట్రంప్, జిన్‌పింగ్
Jinping Meets Trump

ఇంటర్నెట్ డెస్క్: నేడు(గురువారం) ఆసక్తికర పరిణామం చోటుచేసుకోనుంది. ఆరేళ్ల తర్వాత చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ తో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భేటీ కానున్నారు. ట్రంప్ తొలిసారి అధ్యక్షుడుగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంల్లో వీరి భేటీ జరిగింది. తాజాగా భేటీపై నాలుగు వారాల క్రితమే వైట్ హౌస్ ప్రకటించగా... నేడు వీరి భేటీ జరగనుంది. చైనాతో వాణిజ్య విభేదాల వేళ ఈ భేటీ అందరిలో ఉత్కంఠ రేపుతోంది. సోయాబీన్ ఎగుమతుల పైనే ప్రధానంగా చర్చ జరగనున్నట్లు సమాచారం.


గురువారం(అక్టోబర్ 30) నుంచి దక్షిణ కోరియాలోని బుసాన్ నగరంలో ఆసియా- పసిఫిక్ ఎకనామిక్ కో ఆపరేషన్(APEC 2025) సదస్సు ప్రారంభం కానుంది. ఈ సమావేశానికి పలు దేశాధినేతలు హాజరు కానున్నారు. ఈ సదస్సుకు అనుబంధంగా జిన్ పింగ్ తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతామని అమెరికా తెలిపింది. అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెస్సెంట్(Treasury Secretary Scott Bevin) మాట్లాడుతూ.. ఖనిజాల ఎగుమతులపై చైనా విధించిన ఆంక్షలు(US, China trade talks) తగ్గించేలా తాము ప్రయత్నస్తామని తెలిపారు. ఖనిజాలపై చైనా పెట్టిన ఆంక్షలు ప్రపంచవ్యాప్తంగా పరిశ్రమలను కుదిపేసే అవకాశం ఉందన్నారు. అలానే అమెరికా సోయాబీన్స్(soybean exports) కొనుగోళ్లను బీజింగ్ పునరుద్ధరించాలని భావిస్తున్నామని తెలిపారు. ఇది అమెరికన్ రైతుల ఎంతో మేలు జరుగుతుందని స్కాట్ వెల్లడించారు.


ఈ ఏడాది ఆరంభంలో అమెరికా- చైనా( US, China trade) మధ్య వాణిజ్య యుద్ధం మొదలైన సంగతి తెలిసిందే. సుంకాల పెంపుతో ఇరు దేశాలు పరస్పరం విరుచుకుపడ్డాయి. అవకాశం దొరికిన ప్రతిసారీ బీజింగ్ పై ట్రంప్ ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. రష్యా నుంచి చమురులు కొనుగోలు చేస్తున్న భారత్, చైనా దేశాలపై భారీగా ట్యాక్స్ లు విధించాలని ఈయూ, నాటో దేశాలపై కూడా ట్రంప్ ఒత్తిడి చేశాడు. ఇలాంటి ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో చైనా అధ్యక్షుడితో ట్రంప్ భేటీ(US, China tensions) కానుండటం అందరిలో ఆసక్తి రేపుతోంది.



ఈ వార్తలు కూడా చదవండి..

జూబ్లీహిల్స్‌.. భిన్నంగా ఓటర్‌ పల్స్‌!

బీఆర్‌ఎస్‌ గెలిస్తే మూడేళ్లు ఆగాల్సిన అవసరం రాకపోవచ్చు

Updated Date - Oct 30 , 2025 | 08:15 AM