Electricity: ఆ ఏరియా వాసులకు బిగ్ అలెర్ట్.. 10.30 నుంచి కరెంట్ కట్
ABN , Publish Date - Oct 30 , 2025 | 07:15 AM
విద్యుత్ మరమ్మతుల కారణంగా అల్లాపూర్ సెక్షన్‌లో నేడు పలు ప్రాంతాల్లో కరెంట్ సరఫరాకు అంతరాయం ఉంటుందని ఏఈ రాకేష్ గౌడ్ తెలిపారు. పర్వత్‌నగర్ ఫీడర్ పరిధిలోని పర్వత్ నగర్ ప్రభుత్వ ఆస్పత్రి, ప్రభుత్వ పాఠశాల, జేపీనగర్, పర్వత్‌నగర్ కమ్యూనిటీ హాల్ ప్రాంతాల్లో ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ ఉండదని తెలిపారు.
నగరంలో.. నేడు విద్యుత్ ఉండని ప్రాంతాలివే
హైదరాబాద్: విద్యుత్ మరమ్మతుల కారణంగా అల్లాపూర్ సెక్షన్(Allapur Section)లో నేడు పలు ప్రాంతాల్లో కరెంట్ సరఫరాకు అంతరాయం ఉంటుందని ఏఈ రాకేష్ గౌడ్ తెలిపారు. పర్వత్‌నగర్ ఫీడర్ పరిధిలోని పర్వత్ నగర్ ప్రభుత్వ ఆస్పత్రి, ప్రభుత్వ పాఠశాల, జేపీనగర్, పర్వత్‌నగర్ కమ్యూనిటీ హాల్ ప్రాంతాల్లో ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ ఉండదని, 11 కేవీ అల్లాపూర్ ఫీడర్ పరిధిలోని గాయత్రీనగర్ ఇండోర్ స్టేడియం, ఇంద్రావిల్లాస్, హరిహర దేవస్థానం అపోజిట్ వీధులు, ఫ్రెండ్స్ కాలనీ, గాంధీ విగ్రహం ప్రాంతంలో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ ఉండదని ఏఈ రాకేశ్ తెలిపారు.
నేడు విద్యుత్ ఉండని ప్రాంతాలు
పంజాగుట్ట: గ్రీన్‌ల్యాండ్స్ ఏడీఈ(Greenland's ADE) పరిధిలోని పలు ప్రాంతాల్లో గురువారం విద్యుత్ అంతరాయం ఉంటుందని ఏడీఈ వంశీకృష్ణ తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు 11 కేవీ ఆదిత్య ఎన్‌క్లేవ్, శ్రీనివాసనగర్ ఈస్ట్ ఫీడర్ల పరిధిలోని పలు ప్రాంతాలు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 11కేవీ ఆర్‌బీఐ ఫీడర్ పరిధిలోని పలు ప్రాంతాల్లోనూ విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏడీఈ పేర్కొన్నారు.
ఉప్పల్: విద్యుత్ లైన్ల మార్పులు, ఇతర మరమ్మతుల కారణంగా గురువారం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వర కు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు బోడుప్పల్ సబ్-స్టేషన్ ఏఈ ఎన్.వేణుగోపాల్(Boduppal Sub-Station AE N.Venugopal) తెలిపారు. ఎస్‌బీఆర్ కాలనీ ఫీడర్ పరిధిలోని పద్మావతీ కాలనీ, అమ్మసాని వెంకట్ రెడ్డి కాలనీ, పీఎన్‌ఎ్‌స కాలనీ, ఎస్‌బీఆర్ కాలనీ, బి.ఎల్.నగర్, అంజయ్య ఎన్‌క్లేవ్, టెలిఫోన్ కాలనీ ఫేజ్-2, రెడ్డీస్ కాలనీ, భవాని కాలనీ, శుభోదయ కాలనీ, లెక్చర్స్ కాలనీ, గ్రీన్‌సిటీ నగర్, అనఘాపురి కాలనీ, భీంరెడ్డి కాలనీ, ఎన్‌ఐఎన్ కాలనీ ప్రాంతాల వినియోగదారులు సిబ్బందితో సహకరించాలని కోరారు.

రామంతాపూర్‌లో...
రామంతాపూర్: రామంతాపూర్ పాలిటెక్నిక్ ఇండోర్ సబ్ స్టేషన్ పరిధిలోని శ్రీనివాసపురం ఫీడర్‌లోని వెంకట్‌రెడ్డినగర్, నవ రంగ్‌గూడ, కామాక్షిపురం, వివేక్‌నగర్ పరిసర ప్రాంతాలలో ఈనెల 30వ తేది గురువారం మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం నెలకొంటుందని ట్రాన్స్‌కో ఆపరేషన్స్ ఏఈ కూతాడి లావణ్య తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
జూబ్లీహిల్స్.. భిన్నంగా ఓటర్ పల్స్!
బీఆర్‌ఎస్ గెలిస్తే మూడేళ్లు ఆగాల్సిన అవసరం రాకపోవచ్చు
Read Latest Telangana News and National News