Share News

Panic Attack: పానిక్ అటాక్ అంటే ఏంటి? లక్షణాలు, నివారణకు చిట్కాలు ఇవే!

ABN , Publish Date - Aug 09 , 2025 | 04:17 PM

ఇటీవలి కాలంలో చాలా మంది తెలియకుండానే తీవ్ర మానసిక ఆందోళన అనుభవిస్తున్నారు. ఒక్కోసారి ఉన్నట్టుండి భయభ్రాంతులకు గురవుతుంటే.. ఇది పానిక్ అటాక్ కావచ్చు. మానసిక ఒత్తిడి, భయం లేదా మనస్సులో నెగెటివ్ భావాల వల్ల కలిగే ఆకస్మికమైన తీవ్ర ఆందోళనను ఇది కలిగిస్తుంది. సరైన కాలంలో గుర్తించలేకపోతే శరీరం, మనసు రెండింటికీ హానికరం. అసలేంటి సమస్య? లక్షణాలు ఏమిటి? ఎలా నియంత్రించాలి?

Panic Attack: పానిక్ అటాక్ అంటే ఏంటి? లక్షణాలు, నివారణకు చిట్కాలు ఇవే!
How to stop panic attack

How to Stop a Panic Attack: మనసు స్థిరంగా ఉండదు. క్షణానికో ఆలోచన మెదడును కుదిపేస్తుంది. ఊపిరి తీసుకునే వేగం పెరుగుతుంది. ఒక్కసారిగా గుండె దడదడలాడిపోతుంది. చనిపోతున్నామేమో అనే భయం. ఒకే సమయంలో ఇన్ని లక్షణాలు కనిపిస్తే అది పానిక్ అటాక్ కావచ్చు. ఇదీ సమస్య అనే అవగాహన లేక చాలామంది తమ జీవితాలను అంధకారం చేసుకుంటున్నారు. మానసిక వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, పానిక్ అటాక్ జీవితాన్ని తారుమారు చేసే సమస్య. అయితే, దీన్ని సరైన సమయంలో గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకుంటే పూర్తిగా కంట్రోల్ చేయవచ్చు. ఈ సమస్యకు లక్షణాలు, కారణాలు, పరిష్కారాల గురించి ఈ కథనంలో..


పానిక్ అటాక్ అంటే ఏమిటి?

శరీరం కార్టిసాల్, అడ్రినలిన్ విడుదల విషయంలో గందరగోళానికి గురైతే పానిక్ అటాక్ దాడి చేస్తుంది. భయాందోళన లేదా అసౌకర్యం అకస్మాత్తుగా ఉప్పెనలా మనసుపై దాడి చేస్తాయి. నిమిషాల్లోనే గరిష్ఠ స్థాయికి చేరుకుంటుంది. మీ శరీరం ఈ పరిస్థితితో పోరాడటమో లేదా పారిపోవడమో చేయాలని ప్రయత్నిస్తుంది. కానీ, కొన్నిసార్లు ప్రమాదం లేనప్పుడు కూడా, ప్రమాదం ఉన్నట్లుగా ప్రతిస్పందిస్తుంది.


ఈ లక్షణాలుంటే పానిక్ అటాక్?

  • ఆందోళన, గాయం లేదా మానసిక రుగ్మతలు, వ్యక్తిగత లేదా కుటుంబ చరిత్ర

  • అధిక ఒత్తిడితో కూడిన వాతావరణాలు. వృత్తిపరంగా లేదా వ్యక్తిగతంగా

  • థైరాయిడ్ అసమతుల్యత లేదా రక్తంలో చక్కెర హెచ్చుతగ్గులు వంటి వైద్య పరిస్థితులు

  • దీర్ఘకాలిక నిద్ర లేమి

  • సోషల్ మీడియా, వార్తలు లేదా కెఫిన్ నుండి అతిగా తీసుకోవడం

  • భయం కలిగిననప్పుడు (ఆలోచించకండి, చర్య తీసుకోండి)


సాధారణ లక్షణాలు:

  • వేగవంతమైన హృదయ స్పందన లేదా దడ

  • శ్వాస ఆడకపోవడం

  • ఛాతీ నొప్పి లేదా ఒత్తిడి

  • తలతిరగడం

  • చేతులు లేదా ముఖంలో తిమ్మిరి లేదా జలదరింపు

  • నియంత్రణ కోల్పోతామనే భయం లేదా చనిపోతామని భయం

  • స్వీయ లేదా పరిసరాల నుంచి విడిపోయిన భావన

  • శరీరం చెమటలు పెట్టడం లేదా వణుకు రావడం

  • ఛాతిలో నొప్పి లేదా ఒత్తిడి

  • అసలేం జరుగుతోందో అర్థం కాకపోవడం


పానిక్ అటాక్‌ నియంత్రణకు చిట్కాలు:

1. మెల్లగా ఊపిరి తీసుకోవాలి

వేగంగా ఊపిరి తీసుకోకుండా మెల్లగా శ్వాస తీసుకోవడం ద్వారా మనసు కాస్త స్థిరపడుతుంది. "4–7–8" టెక్నిక్ (4 సెకన్లు ఊపిరి తీసుకోవడం, 7 సెకన్లు ఆపడం, 8 సెకన్లు విడిచిపెట్టడం) అనుసరిస్తే వేగంగా కోలుకుంటాం.

2. గ్రౌండింగ్ టెక్నిక్

మీ దృష్టిని చుట్టూ ఉన్న వాతావరణం మీదకు మళ్లించండి. చూడగలిగే 5 వస్తువులు, వినగలిగే 4 శబ్దాలు, తాకగలిగే 3 వస్తువులు గుర్తించడం ద్వారా ఆలోచనలను మరోవైపు మరలించవచ్చు.

3. 'ఇది తాత్కాలికమే' అని అనుకోండి

పానిక్ అటాక్ శాశ్వతం కాదు. కొన్ని నిమిషాల్లో అది దానంతట అదే తగ్గిపోతుంది. అందుకే మీ శరీరం పై మీకు నియంత్రణ ఉందనే నమ్మకం కలిగి ఉండండి.


4. తక్షణ దృష్టిమార్పు

ఇష్టపడే సంగీతం వినడం, నచ్చిన వ్యక్తితో మాట్లాడడం, చల్లని నీరు తాగడం వంటివి పానిక్ అటాక్ నుంచి తక్షణ ఉపశమనం కలిగిస్తాయి.

5. ప్రొఫెషనల్ సహాయం

పానిక్ అటాక్‌లు తరచూ వస్తే మానసిక వైద్య నిపుణుడి సహాయం తీసుకోవడం ఉత్తమం. సైకాలజికల్ కౌన్సిలింగ్, కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ (CBT), అవసరమైన విధంగా మందులు ఉపయోగించవచ్చు.

6.కోల్డ్ వాటర్ షాక్

ముఖం మీద నీళ్లు చిలకరించండి లేదా ఐస్ క్యూబ్ పెట్టండి. ఇది శరీర వ్యవస్థను సాధారణ స్థితికి తెస్తుంది. మెదడును భయం నుంచి మళ్లించి యాక్టివేట్ చేస్తుంది.

7.నడక

గదిలో అటూ ఇటూ నడిచినా పానిక్ అటాక్ నెమ్మదిస్తుంది. ఎందుకంటే శరీర కదలికలు అడ్రినలిన్‌ నియంత్రిస్తాయి. శరీరాన్ని ఫ్రీజ్ మోడ్ నుండి బయటకు తెస్తాయి.


(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)

ఇవి కూడా చదవండి:

45 ఏళ్లు దాటిన ప్రతి ఐదుగురిలో ఒకరికి మధుమేహం

మల్టీవిటమిన్ టాబ్లెట్లతో లివర్‌ కు ముప్పు..!
Read
Latest and Health News

Updated Date - Aug 09 , 2025 | 04:18 PM