Heart Attack Symptoms: ఇవి పాటిస్తే.. నిద్రలో గుండెపోటు సమస్యకు చెక్..
ABN , Publish Date - Oct 14 , 2025 | 08:15 AM
ఈ మధ్య కాలంలో నిద్రలోనే గుండెపోటుతో చాలామంది మృతి చెందుతున్నారు. చాలామందికి నిద్రలోనే గుండెపోటు రావడంతో ఆ విషయం కుటుంబ సభ్యులకు చేరే లోపే ప్రాణాలు కోల్పోతున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: మనం ప్రస్తుతం జీవిస్తున్న సమాజంలో గుండె జబ్బులు పెరిగిపోయాయి అనడంలో అతిశయోక్తి లేదు. దానికి కారణం.. మనం నిత్యం తీసుకునే ఆహర ఆలవాట్లు, మన జీవనశైలి కారణం కావచ్చు. ప్రస్తుతం చిన్నా పెద్దా అని తేడా లేకుండా చాలా మంది గుండెపోటుతో బాధపడుతున్నారు. ఇటీవలి కాలంలో ఉరుకుల పరుగుల జీవితం కావడంతో మారిన ఆహారపు అలవాట్ల కారణంగా చిన్నవయసులోనే అనేక మందికి గుండెపోటు వస్తుందని వైద్యులు చెబుతున్నారు. అయితే గుండె పోటు వచ్చే ముందు గుండె వేగంగా కొట్టుకోవడం, చెమటలు పట్టడం, ఛాతీలో అసౌకర్యంగా అనిపించడం, ఒళ్లు నొప్పులు, తల తిరిగినట్లుగా అనిపించడం లాంటి లక్షణాలు ఉంటాయని నిపుణులు తెలిపారు. ఈ లక్షణాలు గమనిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలని సూచించారు.
ఈ మధ్య కాలంలో నిద్రలోనే గుండెపోటుతో చాలామంది మృతి చెందుతున్నారు. చాలామందికి నిద్రలోనే గుండెపోటు రావడంతో ఆ విషయం కుటుంబ సభ్యులకు చేరే లోపే ప్రాణాలు కోల్పోతున్నారు. నిద్రలో మన శరీరం విశ్రాంతి తీసుకుంటున్నా గుండె పని చేస్తుందనేది మనకు తెలిసిందే. అయితే గుండె లయ తప్పడం, గుండెలోని ధమనులు మూసుకుపోవడం, అధిక రక్తపోటు లాంటి సమస్యల కారణంగా నిద్రలో గుండెపోటు వచ్చే ప్రమాదం అధికంగా ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఎప్పటికప్పుడు వైద్యుడిని సంప్రదించి చికిత్స తీసుకోవాలని సూచిస్తున్నారు.
అలాగే నిద్రపోయే ముందు డీప్ బ్రీత్ తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. డీప్ బ్రీత్ తీసుకోవడం వల్ల మనసు ప్రశాంతంగా మారుతుందంటున్నారు. 4 సెకన్ల పాటు శ్వాస తీసుకోవడం, 7 సెకన్ల పాటు శ్వాసను అలాగే బంధించడం.. 8 సెకన్లు పాటు శ్వాసను వదిలిపెట్టాలని డాక్టర్లు చెబుతున్నారు. ఇది క్రమం తప్పకుండా పాటించడం వల్ల హృదయ స్పందన రేటు, రక్తపోటును తగ్గిస్తుందని వైద్యులు వివరిస్తున్నారు. అలాగే మనం తీసుకునే ఆహరంలో మార్పులు చేయడం వల్ల, రోజు వ్యాయామాలు చేయడం వల్ల ఈ గుండె సమస్యలకు చెక్ పెట్టవచ్చని స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి..
Government Policy: బాబోయ్ ఇథనాల్
TCS CEO Kriti Vasudevan: కొత్తగా హెచ్-1బీ ఉద్యోగులను నియమించం టీసీఎస్ సీఈవో కృతివాసన్ వెల్లడి