Nose Picking Habit: పదే పదే ముక్కులో వేలు పెట్టుకుంటే ఈ ఆరోగ్య సమస్యలు..?
ABN , Publish Date - Sep 01 , 2025 | 08:15 PM
కొంతమందికి ముక్కు లోపల వేలు పెట్టుకునే అలవాటు ఉంటుంది. ఈ అలవాటు అత్యంత సాధారణమైందిగానే కనిపించవచ్చు. కానీ, ఇది ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. ముక్కు లోపల చేతులు పెట్టడం వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు ఏమిటి? ఈ అలవాటును ఎందుకు మానుకోవాలి? ఈ కథనంలో..
చాలా మందికి ముక్కులో వేలు పెట్టుకోవడం ఉంటుంది. పదిమందిలో ఉన్నప్పటికీ ఈ అలవాటును యధావిధిగా కొనసాగిస్తూనే ఉంటారు. ముఖ్యంగా చిన్నపిల్లల్లో ఈ అలవాటు ఎక్కువ. కొంతమంది పెద్దయ్యాక కూడా మానుకోలేరు. కానీ ఇది తీవ్రమైన ఆరోగ్య ప్రమాదాలకు కారణమవుతుంది. ఈ అలవాటు ఉన్నవారు పదే పదే ముక్కు లోపల చేతివేళ్లు పెట్టడం వల్ల బ్యాక్టీరియా, వైరస్‌లు శరీరంలోకి సులభంగా ప్రవేశిస్తాయి. ముక్కులోని సున్నితమైన కణజాలాలు, రక్త నాళాలు ఇన్ఫెక్షన్‌కు గురవుతాయి. సైనస్, ముక్కు, గొంతు ఇన్ఫెక్షన్ల ప్రమాదం పెరుగుతుంది. మీ చేతులపై ఉన్న క్రిములు నేరుగా ముక్కును చేరుకుని జలుబు, ఫ్లూ లేదా రినిటిస్ వంటి సమస్యలను కలిగిస్తాయి. దీనితో పాటు, రక్త ఇన్ఫెక్షన్లు లేదా ముక్కు కణజాలాలకు గాయాలు అయ్యే అవకాశం ఉంది.
మన చేతులు అన్నిసార్లు శుభ్రంగా ఉండవు. సమయం, సందర్భం లేకుండ ముక్కు లోపల చేతివేళ్లు పెట్టుకోవడం వల్ల చేతులపై బ్యాక్టీరియా, వైరస్‌లు నేరుగా శరీరంలోకి ప్రవేశిస్తాయి. కాబట్టి చేతులు కడుక్కోవడం, గోళ్లను శుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఈ అలవాటు ఆరోగ్యానికి ప్రమాదకరం మాత్రమే కాదు. సామాజికంగా కూడా ఇబ్బంది కలిగిస్తుంది. బహిరంగ ప్రదేశాల్లో ఇలా చేస్తే నలుగురూ చిన్నచూపు చూసేందుకు అవకాశముంది. ఇతరుల్లో మీపై ప్రతికూల అభిప్రాయం ఏర్పడేందుకు ఆస్కారముంటుంది.
ఈ అలవాటును మానుకోవడానికి కొన్ని సులభమైన మార్గాలు.
ముక్కు దురదగా లేదా మూసుకుపోయి ఉంటే టిష్యూ పేపర్ వాడండి.
చేతులను క్రమం తప్పకుండా కడుక్కోండి. వాటిని శుభ్రంగా ఉంచండి.
ముక్కును శుభ్రం చేయడానికి ఉప్పు నీటి స్ప్రే లేదా నోస్ క్లీనింగ్ ఉత్పత్తులను ఉపయోగించండి.
ఈ అలవాటు ఒత్తిడి లేదా ఆందోళనకు సంబంధించినది అయితే, మైండ్‌ఫుల్‌నెస్ లేదా రిలాక్సేషన్ వ్యాయామాలను అవలంబించండి.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)
Also Read
చర్మంపై తెల్లని మచ్చలు ఎందుకు వస్తాయి.. ఇది ఒక వ్యాధినా?
ఈ విటమిన్లు లేకుంటే మనసు అల్లకల్లోలమే! నెగెటివ్ థాట్స్‌కు ఇదే కారణం?
For More Latest News