RRB Jobs 2025: నిరుద్యోగులకు బంపర్ ఆఫర్.. 6374 ఉద్యోగాల భర్తీకి రైల్వే భారీ నోటిఫికేషన్..
ABN , Publish Date - Jun 18 , 2025 | 11:17 AM
RRB Technician Recruitment 2025: నిరుద్యోగులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్. 6180 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు RRB అధికారిక వెబ్‌సైట్ ద్వారా వెంటనే దరఖాస్తు చేసుకోండి. ఆన్‌లైన్ లో దరఖాస్తు ఫారమ్ సమర్పించడానికి చివరి తేదీ 28-07-2025.
RRB Technician Recruitment 2025 Apply Online: రైల్వే శాఖలో ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే మీ కల అయితే ఇదే మంచి ఛాన్స్. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) భారీ ఉద్యోగ నియామక నోటిఫికేషన్ జారీ చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న 18 రైల్వే జోన్లలోని 6180 టెక్నీషియన్ పోస్టులను భర్తీ చేయనుంది. 51 విభాగాలలో గ్రేడ్ 1, గ్రేడ్ 3 ఖాళీలను ఈ నియామకం ద్వారా పూరించనున్నారు.
ఈ నియామకంలో దేశవ్యాప్తంగా 18 రైల్వే జోన్లలో 6374 టెక్నీషియన్ పోస్టులను భర్తీ చేస్తారు. సౌత్ ఈస్టర్న్ రైల్వే (SER) అత్యధికంగా 1,215, తూర్పు మధ్య రైల్వే (ECR)లో అత్యల్పంగా 31పోస్టులు ఉన్నట్లు సమాచారం. భారతీయ రైల్వే ఇప్పటికే ఈ తాత్కాలిక ఖాళీలను ఆమోదించింది. వివరణాత్మక నోటిఫికేషన్ (CEN) త్వరలో అన్ని ప్రాంతీయ RRB వెబ్‌సైట్‌లలో విడుదల చేయబడుతుందని భావిస్తున్నారు. తుది ఖాళీల వివరాలు త్వరలోనే విడుదల కానుందున అభ్యర్థులు తరచూ అధికారిక వెబ్ సైట్ తనిఖీ చేస్తూ ఉండాలని RRB సూచించింది.
RRB టెక్నీషియన్ రిక్రూట్‌మెంట్ 2025 జోన్ వారీగా వివరాలు-
తూర్పు రైల్వే (ER): 1,119 పోస్టులు
వెస్ట్రన్ రైల్వే (WR): 849 పోస్టులు
ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF): 404 పోస్టులు
ఉత్తర రైల్వే (NR): 478 పోస్టులు
నార్త్ సెంట్రల్ రైల్వే (NCR): 241 పోస్టులు
సెంట్రల్ రైల్వే (CR): 305 పోస్టులు
మొత్తం: 6374 పోస్టులు (RRB వెబ్‌సైట్‌లో అధికారిక నోటిఫికేషన్ ఇంకా విడుదల చేయలేదు. పోస్టుల సంఖ్య మారే అవకాశముంది)
విద్యార్హత:
గ్రేడ్ I టెక్నీషియన్ (సిగ్నల్): సంబంధిత విభాగంలో బి.ఎస్సీ లేదా టెక్నికల్ డిప్లొమా.
గ్రేడ్ III టెక్నీషియన్: గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి, సంబంధిత ITI (NCVT లేదా SCVT)లో శిక్షణ కలిగి ఉండాలి.
వయోపరిమితి
గ్రేడ్ I (సిగ్నల్): కనీసం 18 సంవత్సరాలు – గరిష్ఠంగా 36 సంవత్సరాలు.
గ్రేడ్ III: కనీసం 18 సంవత్సరాలు – గరిష్ఠంగా 33 సంవత్సరాలు.
వయోమితి సడలింపు
ఎస్సీ/ఎస్టీ వారికి 5 సంవత్సరాలు. ఓబీసీ (నాన్-క్రీమి లేయర్) 3 సంవత్సరాలు. దివ్యాంగులకు10 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉండవచ్చు.
జీతం
గ్రేడ్ I ఉద్యోగులకు జీతం రూ.29,200 నుంచి రూ.92,300,
గ్రేడ్ ఉద్యోగులకు జీతం రూ.19,900 నుంచి రూ.63,200.
దరఖాస్తు రుసుము
జనరల్/ఓబీసీ/EWS అభ్యర్థులు: రూ.500
ఎస్సీ/ఎస్టీ/మహిళలు/దివ్యాంగులకు: రూ.250. రుసుమును ఆన్‌లైన్ ద్వారా క్రెడిట్ కార్డ్/డెబిట్ కార్డ్/నెట్ బ్యాంకింగ్ ద్వారా చేయాలి.
ఎంపిక విధానం
కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT), డాక్యుమెంట్ వెరిఫికేషన్, వైద్య పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఉద్యోగులను ఎంపిక చేస్తారు. CBT పరీక్షలో నెగెటివ్ మార్కింగ్ ఉంది (ప్రతి తప్పు సమాధానానికి -0.33).
నోటిఫికేషన్ విడుదల తేదీ: 10-06-2025
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేదీ: 28-06-2025
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ : 28-07-2025 (రాత్రి 11.59 గంటలు)
ఈ వార్తలు కూడా చదవండి..
నెట్ ఉంటే చాలు! ఇంటి నుంచే గూగుల్ ఫ్రీ ఏఐ కోర్సు.. నిరుద్యోగులకు బంపర్ ఆఫర్!
నీట్ యూజీలో తక్కువ స్కోర్ ఉందా.. పర్లేదు.. ఈ కోర్సుతో బంగారు భవిష్యత్తు మీదే!
For National News And Telugu News