Share News

ISRO Recruitment 2025: ఇస్రోలో ఉద్యోగం సంపాదించడం మీ కలా.. వెంటనే దరఖాస్తు చేయండి..

ABN , Publish Date - May 05 , 2025 | 09:03 PM

ISRO Recruitment 2025: నిరుద్యోగ యువతీ యువకులకు గుడ్ న్యూస్. డిగ్రీ, బీటెక్ అర్హతతో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)లో పనిచేసే అవకాశం. ఆసక్తి ఉన్న అభ్యర్థులు వెంటనే అలర్ట్ అవండి. చివరి తేదీ దగ్గరపడుతోంది కాబట్టి ఇస్రో అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి దరఖాస్తు చేసుకోండి.

ISRO Recruitment 2025: ఇస్రోలో ఉద్యోగం సంపాదించడం మీ కలా.. వెంటనే దరఖాస్తు చేయండి..
ISRO Scientist Engineer Jobs Recruitment 2025

ISRO Recruitment 2025: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)ఇటీవల సైంటిస్ట్, ఇంజనీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి ఉన్న ఎవరైనా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు . ఎంపికైన అభ్యర్థులను బెంగళూరు, హైదరాబాద్, తిరువనంతపురం, మహేంద్రగిరి, అహ్మదాబాద్, హసన్, వలియమల, శ్రీహరికోట కేంద్రాలలో నియమిస్తారు. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 63 సైంటిస్ట్/ఇంజనీర్ పోస్టులను భర్తీ చేస్తారు. మొత్తం ఖాళీలలో 22 ఎలక్ట్రానిక్స్ విభాగంలో, 33 మెకానికల్ విభాగంలో, 8 కంప్యూటర్ సైన్స్ విభాగంలో ఉన్నాయి.


ఇస్రో 63 సైంటిస్ట్/ఇంజనీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎలక్ట్రానిక్స్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్ పోస్టులకు బీఈ/బీటెక్ డిగ్రీతో పాటు 2024/2025 గేట్ స్కోర్ అవసరం. మే 14 లోపు దరఖాస్తులను ఆన్‌లైన్‌లో సమర్పించవచ్చు. రిజర్వ్‌డ్ కేటగిరీలకు చెందిన వారికి వయో సడలింపు ఉంటుంది. మరిన్ని వివరాలకు ఇస్రో వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.


ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, మెకానికల్ లేదా కంప్యూటర్ సైన్స్‌లో కనీసం 30% మార్కులు కలిగి ఉండాలి. 65 మార్కులతో BE లేదా BTech డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే 2024 లేదా 2025 నుంచి గేట్ స్కోర్ అవసరం. అభ్యర్థులు 28 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉండకూడదు. రిజర్వ్‌డ్ కేటగిరీలకు చెందిన వారికి వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.


ఆసక్తి గల అభ్యర్థులు మే 14న లేదా అంతకు ముందు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. జనరల్ అభ్యర్థులు రూ. 250 దరఖాస్తు రుసుము చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మాజీ సైనికులు, మహిళా అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది. ఎంపిక 2024/2025 సంవత్సరానికి గేట్ స్కోర్, ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది. విద్యార్హతల ఆధారంగా అభ్యర్థులను 1:7 నిష్పత్తిలో ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.56,100 జీతంతో పాటు DA, HRA, TA, కొత్త పెన్షన్ పథకం/ఏకీకృత పెన్షన్ పథకం, వ్యక్తిగత, కుటుంబ సభ్యులకు వైద్య సౌకర్యాలు, LTA, గ్రూప్ ఇన్సూరెన్స్, గృహ నిర్మాణ అడ్వాన్స్ వంటి ఇతర ప్రయోజనాలు లభిస్తాయి.


ఇంటర్వ్యూ ఎలా ఉంటుంది?

ఇంటర్వ్యూకు 100 మార్కులు ఉంటాయి. ఇందులో వారు చదివిన కోర్సుకు సంబంధించిన ప్రశ్నలకు 40 మార్కులు, సాధారణ అవగాహనకు 20 మార్కులు, ప్రజెంటేషన్, కమ్యూనికేషన్ నైపుణ్యాలకు 20 మార్కులు, గ్రహణశక్తికి 10 మార్కులు, చదువులో సాధించిన విజయాలకు 10 మార్కులు కేటాయిస్తారు. ఇంటర్వ్యూలో కనీసం 60 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది. మరిన్ని వివరాలకు ఇస్రో వెబ్‌సైట్‌ను సందర్శించండి .


Read Also: SBI Recruitment: నిరుద్యోగులకు SBI తీపికబురు.. త్వరలో 18 వేల పోస్టులకు నోటిఫికేషన్..

సీపెట్‌ అడ్మిషన్‌ టెస్ట్‌ 2025

యూజీసీ నెట్‌ 2025

Updated Date - May 05 , 2025 | 09:05 PM