Share News

SBI Recruitment: నిరుద్యోగులకు SBI తీపికబురు.. త్వరలో 18 వేల పోస్టులకు నోటిఫికేషన్..

ABN , Publish Date - May 05 , 2025 | 03:45 PM

SBI Recruitment 2025: బ్యాంకులో ఉద్యోగం పొందాలనుకునే వారికి శుభవార్త. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ సంవత్సరం SBI భారీ దేశవ్యాప్తంగా వేలాది పోస్టులలో నియామకాలకు ఒక సువర్ణావకాశం ఉంది. ఈ సంవత్సరం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 18000 నియామకాలను ప్రకటించిందని తెలిపింది.

SBI Recruitment: నిరుద్యోగులకు SBI తీపికబురు.. త్వరలో 18 వేల పోస్టులకు నోటిఫికేషన్..
SBI Recruitment 2025

State Bank of India Jobs 2025: SBI (స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా)లో ఉద్యోగం సంపాదించడానికి ఒక అద్భుతమైన అవకాశం రాబోతోంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 18,000 మంది కొత్త ఉద్యోగులను నియమించుకోవాలని బ్యాంక్ లక్ష్యంగా పెట్టుకుంది. వీటిలో క్లర్క్, PO, Clerk, LBO, సిస్టమ్ ఆఫీసర్ పోస్టులు ఉంటాయి. సాధారణ బ్యాంకింగ్ సేవలలో పెరుగుతున్న డిమాండ్లను తీర్చడం, బ్యాంక్ సాంకేతిక సామర్థ్యాలను పెంపొందించడమే ఈ రిక్రూట్‍‌మెంట్ డ్రైవ్ లక్ష్యమని బ్యాంక్ చైర్మన్ సిఎస్ శెట్టి పేర్కొన్నారు.


గత దశాబ్దంలో స్టేట్ బ్యాంక్ నిర్వహించిన అతిపెద్ద నియామకం ఇదే. అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకింగ్ సంస్థ SBI సాంకేతిక నైపుణ్యాన్ని మరో స్థాయికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ నియామకం చేపట్టినట్టు ఎస్‌బీఐ బ్యాంక్ చైర్మన్ సిఎస్ శెట్టి తెలిపారు. అర్హత ప్రమాణాలు, వయోపరిమితి, రిక్రూట్‌మెంట్ డ్రైవ్ గురించి మరిన్ని వివరాలను క్రింద చూడండి


SBI క్లర్క్ రిక్రూట్‌మెంట్ 2025 ముఖ్యమైన తేదీలు:

  • దరఖాస్తు ప్రారంభ తేదీ: త్వరలో వెలువడనుంది

  • దరఖాస్తు ముగింపు తేదీ: త్వరలో వెలువడనుంది

  • ప్రాథమిక పరీక్ష: ఇంకా ప్రకటించలేదు

  • ప్రధాన పరీక్ష: త్వరలో వెలువడనుంది


అర్హత ప్రమాణాలు

దరఖాస్తుదారు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఏదైనా విభాగంలో పట్టభద్రుడై ఉండాలి లేదా కేంద్ర ప్రభుత్వం గుర్తించిన ఏదైనా సమానమైన అర్హత కలిగి ఉండాలి. ఇంటిగ్రేటెడ్ డ్యూయల్ డిగ్రీ (IDD) సర్టిఫికెట్లు ఉన్న అభ్యర్థులు IDD ఉత్తీర్ణత తేదీని నిర్ధారించుకోవాలి.


వయోపరిమితి

అభ్యర్థి వయస్సు 20 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి.


దరఖాస్తు రుసుములు

జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యుఎస్ కేటగిరీలకు- రూ. 750/-. కానీ, SC/ST/PwBD/ESM/DESM వర్గాలకు చెందిన అభ్యర్థులు ఎటువంటి దరఖాస్తు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. స్క్రీన్‌పై అడిగిన సమాచారం ఆధారంగా డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్/ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉపయోగించి చెల్లింపులు చేయవచ్చు.


SBI క్లర్క్ రిక్రూట్‌మెంట్ 2025 కి ఎలా దరఖాస్తు చేయాలి-

  • Step 1: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) అధికారిక వెబ్‌సైట్ sbi.co.in కి వెళ్లండి.

  • Step 2: హోమ్‌పేజీకి చేరుకున్న తర్వాత జూనియర్ అసోసియేట్ రిక్రూట్‌మెంట్ లింక్‌కి వెళ్లండి.

  • Step 3: రిజిస్ట్రేషన్ లింక్‌పై క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోండి.

  • Step 4: ఆధారాలతో లాగిన్ అవ్వండి. మార్గదర్శకాల ప్రకారం ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌ను పూరించండి.

  • Step 5: అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేసి రుసుము చెల్లించండి.

  • Step 6: దరఖాస్తు ఫారమ్‌ను సబ్మిట్ చేయండి.

  • Step 7: భవిష్యత్తు అవసరాల కోసం దరఖాస్తు ఫారమ్ హార్డ్ కాపీని సేవ్ లేదా ప్రింటవుట్ తీసి పెట్టుకోండి.


Read Also: సీపెట్‌ అడ్మిషన్‌ టెస్ట్‌ 2025

యూజీసీ నెట్‌ 2025

రొటీన్‌ భిన్నం ఈ డిప్లొమాలు ప్యాకేజింగ్‌ టెక్నాలజీ

Updated Date - May 05 , 2025 | 05:31 PM