రొటీన్ భిన్నం ఈ డిప్లొమాలు ప్యాకేజింగ్ టెక్నాలజీ
ABN , Publish Date - May 05 , 2025 | 04:16 AM
హైదరాబాద్ రామంతపూర్‌లో ఉన్న జవహర్‌లాల్ నెహ్రూ గవర్నమెంట్ పాలిటెక్నిక్ ప్యాకేజింగ్ టెక్నాలజీ కోర్సును ఆఫర్ చేస్తోంది. వస్తువు చెడిపోకుండా, సురక్షితంగా వినియోగదారుడి చేతికి...
హైదరాబాద్ రామంతపూర్‌లో ఉన్న జవహర్‌లాల్ నెహ్రూ గవర్నమెంట్ పాలిటెక్నిక్ ప్యాకేజింగ్ టెక్నాలజీ కోర్సును ఆఫర్ చేస్తోంది. వస్తువు చెడిపోకుండా, సురక్షితంగా వినియోగదారుడి చేతికి చేరేందుకు దానికి చుట్టూ కల్పించే రక్షణే ప్యాకేజింగ్. మందంగా ఉండే కాగితం మొదలుకుని అట్టపెట్టె, చెక్కతో చేసే ప్యాకేజింగ్ మనకు తెలుసు. ఒక వస్తువు వేడిగా లేదంటే చల్లగా ఉండేందుకు అనువైన ప్యాకేజింగ్ అవసరం. సదరు విషయాలు అన్నింటినీ శాస్త్రీయం బోధించేదే డిప్లొమా ఇన్ ప్యాకేజింగ్ టెక్నాలజీ గ్రామీణ, పేద విద్యార్థులకు ఈ కోర్సు నిజంగా వరమని చెప్పాలి. కోర్సులో భాగంగా ప్యాకేజింగ్ మెటీరియల్ బేసిక్స్, మెథడాలజీ, డిజైన్, అప్లికేషన్ వంటి విషయాలన్నీ బోధిస్తారు. చివరి సెమిస్టర్‌లో సంబంధిత కంపెనీకి పంపి ప్రాక్టికల్‌గా అవగాహన కల్పిస్తారు.
ఉన్నత చదువులు
ప్యాకేజింగ్ టెక్నాలజీ కోర్సు చేసిన వారు ఈ రంగంలో స్థిరపడాలని లేదు. భవిష్యత్తులో తమ ఆసక్తి మారితే అందుకు అనుగుణంగా కూడా కోర్సులు చేయవచ్చు.
ఈసెట్‌లో ర్యాంక్ సాధించి లేటరల్ ఎంట్రీ కింద బీటెక్‌లో చేరవచ్చు. మెకానికల్, ఏరోనాటికల్, ప్రొడక్షన్ ఇంజనీరింగ్ సీఎ్‌సఇ, ఐటీ బ్రాంచీల్లో చేరడానికి కూడా ఈ కోర్సు చేసినవారు అర్హులు.
ఒకవేళ ఇదే ప్రింటింగ్ టెక్నాలజీ కోర్సులో కొనసాగాలి అనుకుంటే హరియాణా రాష్ట్రం హిస్సార్‌లోని ‘గురు జంబేశ్వర్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ’ అలాగే ‘హర్యానా సెంట్రల్ యూనివర్సిటీ ప్రింటింగ్ అండ్ ప్యాకేజింగ్ టెక్నాలజీ’లో బీటెక్ కోర్సును అందిస్తున్నాయి.
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్ సహకారంతో హైదరాబాద్‌లోని జేఎన్‌టీయూ ప్యాకేజింగ్‌లో ఎమ్మెస్సీ, ఐఐటీ రూర్కీ ప్యాకేజింగ్ టెక్నాలజీలో ఎంటెక్ అందిస్తున్నాయి.
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్ నేరుగా ప్యాకేజింగ్‌లో సర్టిఫికెట్, పీజీ డిప్లొమా ఆఫర్ చేస్తోంది.
ఉద్యోగ అవకాశాలు
ప్రొడక్ట్ డెలివరీ(అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి సంస్థలు), ఫుడ్ డెలివరీ(స్విగ్గీ, జొమాటో వంటివి), ఫార్మా ఇండస్ట్రీ సహా ప్యాకేజింగ్ అవసరమైన ప్రతి సంస్థలో వీరికి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. ఎలక్ట్రికల్ - ఎలకా్ట్రనిక్ గాడ్జట్ల నుంచి వినియోగదారుడి చెంతకు చేరాల్సిన ప్రతి ప్రొడక్ట్‌కు ప్యాకేజింగ్ అవసరమే. అందుకే ఈ డిప్లొమా చేసిన వారికి నిరుద్యోగం అన్న ప్రసక్తే ఉండదు. నిజానికి డిమాండ్‌కు తగ్గ సరఫరాలేదు అన్నది నిజం కూడా.
ఇవి కూడా చదవండి
Pehalgam Terror Attack: ప్రధాని మోదీతో చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ భేటీ..
India Vs Pakistan: భారత్ సైనిక సమాచారం పాక్‌కు చేరవేత.. ఇద్దరి అరెస్ట్
Rahul Gandhi: సిక్కుల ఊచకోతపై రాహుల్ గాంధీ స్పందన
For National News And Telugu News