Share News

యూజీసీ నెట్‌ 2025

ABN , Publish Date - May 05 , 2025 | 04:21 AM

దేశ వ్యాప్తంగా ఎంపిక చేసిన పట్టణాల్లో యూజీసీ నెట్‌ను మొత్తం 83 సబ్జెక్టుల్లో నిర్వహిస్తారు. భాషా సబ్జెక్టులు తప్పించి మిగిలిన అన్ని ప్రశ్నపత్రాలు ఇంగ్లిష్‌, హిందీ మాధ్యమాల్లో ఉంటాయి....

యూజీసీ నెట్‌ 2025

రిమైండర్‌

ప్రతీనెల ఉపకార వేతనం తీసుకుంటూ, పరిశోధనలో కొనసాగడానికి చక్కని అవకాశం యూజీసీ నెట్‌. అంతేకాదు ఈ జాతీయ అర్హత పరీక్ష(నెట్‌) అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల పోటీకీ, ప్రభుత్వ అనుబంధ సంస్థల్లో ఉద్యోగాలకూ ప్రామాణికం.. ఇంత ప్రాధాన్యం ఉన్న యూజీసీ నెట్‌ 2025 దరఖాస్తు గడువు త్వరలో ముగియనుంది.

దేశ వ్యాప్తంగా ఎంపిక చేసిన పట్టణాల్లో యూజీసీ నెట్‌ను మొత్తం 83 సబ్జెక్టుల్లో నిర్వహిస్తారు. భాషా సబ్జెక్టులు తప్పించి మిగిలిన అన్ని ప్రశ్నపత్రాలు ఇంగ్లిష్‌, హిందీ మాధ్యమాల్లో ఉంటాయి. పరీక్ష అందరికీ ఉమ్మడిగానే ఉన్నప్పటికీ మూడు కేటగిరీలు ఉంటాయి.

కేటగిరీ-1: ఎంపికైనవారు ప్రతి నెలా యూజీసీ నిర్దేశిత స్టయిఫండ్‌(జేఆర్‌ఎఫ్‌) పొందుతూ పరిశోధన(పీహెచ్‌డీ) కొనసాగించవచ్చు. అలాగే వీరు అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు, జేఆర్‌ఎఫ్‌ లేకుండా జరిపే పీహెచ్‌డీ ప్రవేశాలకు అర్హులు.

కేటగిరీ-2: ఇందులో అవకాశం వస్తే జేఆర్‌ఎఫ్‌ దక్కదు. కానీ అసిస్టెంట్‌ పోస్టులకు, పీహెచ్‌డీ ప్రవేశాలకు అర్హులే.

కేటగిరీ-3: వీరు పీహెచ్‌డీలో ప్రవేశానికి అర్హులు. జేఆర్‌ఎఫ్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ కోసం అర్హత ఉండదు.


విద్యార్హత: సంబంధిత సబ్జెక్టుల్లో 55 శాతం మార్కులతో పీజీ పాసై ఉండాలి. ఎస్సీ,/ఎస్టీ/ఓబీసీ నాన్‌ క్రిమిలేయర్‌, దివ్యాంగులు, థర్డ్‌ జెండర్‌ వ్యక్తులకు 50 శాతం మార్కులు చాలు. ప్రస్తుతం పీజీ కోర్సు చేస్తున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. నాలుగేళ్ల గ్రాడ్యుయేషన్‌ చేస్తున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. వీరికి డిగ్రీలో 75 శాతం మార్కులు ఉండాలి. ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ/ఈడబ్ల్యూఎ్‌సలకు 70 శాతం చాలు. యూజీతో జేఆర్‌ఎఫ్‌, పీహచ్‌డీల్లో ప్రవేశానికి అర్హులు. పీజీ లేనందువల్ల అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు పోటీ పడలేరు. పైనల్‌ ఇయర్‌ చదువుతున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

వయస్సు: అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ అర్హత పొందడానికి, పీహెచ్‌డీ ప్రవేశానికి వయసు నిబంధన లేదు. జేఆర్‌ఎ్‌ఫకు 2025 జూన్‌ 1వ తేదీ నాటికి30 ఏళ్లలోపు ఉండాలి. పైన పేర్కొన్న వారికి గరిష్ట వయోపరిమితిలో ఐదేళ్ల సడలింపు ఉంటుంది.

చివరి తేదీ: 2025 మే 7

పరీక్షలు: జూన్‌ 21 నుంచి 30 తేదీ వరకు

వెబ్‌సైట్‌: https://ugcnet.nta.ac.in/

ఇవి కూడా చదవండి

Pehalgam Terror Attack: ప్రధాని మోదీతో చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ భేటీ..

India Vs Pakistan: భారత్ సైనిక సమాచారం పాక్‌కు చేరవేత.. ఇద్దరి అరెస్ట్

Rahul Gandhi: సిక్కుల ఊచకోతపై రాహుల్ గాంధీ స్పందన

For National News And Telugu News

Updated Date - May 05 , 2025 | 04:22 AM