Share News

సీపెట్‌ అడ్మిషన్‌ టెస్ట్‌ 2025

ABN , Publish Date - May 05 , 2025 | 04:27 AM

సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రోకెమికల్స్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ దేశ వ్యాప్తంగా ఉన్న 30 సీపెట్‌ కేంద్రాల్లో అడ్మిషన్‌ టెస్ట్‌ ద్వారా డిప్లొమా, పీజీ డిప్లొమా, పోస్ట్‌ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు...

సీపెట్‌ అడ్మిషన్‌ టెస్ట్‌ 2025

సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రోకెమికల్స్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ దేశ వ్యాప్తంగా ఉన్న 30 సీపెట్‌ కేంద్రాల్లో అడ్మిషన్‌ టెస్ట్‌ ద్వారా డిప్లొమా, పీజీ డిప్లొమా, పోస్ట్‌ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. ఆంధ్రప్రదేశ్‌ విజయవాడ కేంద్రంలో 150, తెలంగాణ హైదరాబాద్‌ కేంద్రంలో 300 సీట్లు ఉన్నాయి. అర్హులైన స్ర్తీ, పురుష అభ్యర్థులు 2025 మే 29 తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.


కోర్సులు

డిప్లొమా ఇన్‌ ప్లాస్టిక్‌ మౌల్డ్‌ టెక్నాలజీ: మూడు సంవత్సరాల వ్యవధి కోర్సు ఇది. మొత్తం ఆరు సెమిస్టర్లు ఉంటాయి. పదో తరగతి పాసైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.

డిప్లొమా ఇన్‌ ప్లాస్టిక్‌ టెక్నాలజీ: మూడు సంవత్సరాల వ్యవధి కోర్సు ఇది. మొత్తం ఆరు సెమిస్టర్లు ఉంటాయి. పదో తరగతి పాసైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.

పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ డిప్లొమా ఇన్‌ ప్లాస్టిక్‌ ప్రాసెసింగ్‌ అండ్‌ టెస్టింగ్‌: రెండు సంవత్సరాల వ్యవధి కోర్సు ఇది. నాలుగు సెమిస్టర్లు ఉంటాయి. సైన్స్‌తో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసినవారు దరఖాస్తు చేసుకోవచ్చు.

పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ ప్లాస్టిక్‌ మౌల్డ్‌ డిజైన్‌ విత్‌ క్యాడ్‌/క్యామ్‌: ఒక సంవత్సరం ఆరు నెలల వ్యవధి కోర్సు ఇది. మూడు సెమిస్టర్లు ఉంటాయి. మెకానికల్‌/ప్లాస్టిక్స్‌/పాలిమర్‌/టూల్‌/ప్రొడక్షన్‌/మెకట్రానిక్స్‌/అటోమోబైల్‌/టూల్‌ అండ్‌ డై మేకింగ్‌/ పెట్రోకెమికల్స్‌/ ఇండస్ట్రియల్‌/ ఇన్‌స్ట్రుమెంటేషన్‌ ఇంజనీరింగ్‌/ టెక్నాలజీ లేదా డీపీఎమ్‌టీ/డీపీటీ(సీపెట్‌) డిప్లొమా చేసినవారు దరఖాస్తు చేసుకోవచ్చు.

(హైదరాబాద్‌ క్యాంప్‌సలో నాలుగు కోర్సులు ఉండగా, విజయవాడ క్యాంపస్‌లో మాత్రం క్యాడ్‌/కామ్‌ కోర్సు లేదు)


వయస్సు: ఈ కోర్సులకు ఎలాంటి గరిష్ట వయోపరిమితి లేదు.

ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష ఆధారంగా

దరఖాస్తు రుసుము: 100/- చివరి తేదీ: 2025 మే 29

ఎంట్రెన్స్‌ తేదీ: జూన్‌ 8

కోర్సు ప్రారంభం: 2025 జూలై 14

వెబ్‌సైట్‌: www.cipet.gov.in

CIPET - Telangana

IDA Phase-II, Cherlapally,

Hyderabad - 500051

hyderabad@cipet.gov.in

Ph: 8093140230, 8374064444

CIPET - Andhra Pradesh

Survey No.377, Surampalli(V), Gannavaram (M), Krishna Dist, Vijayawada - 521 212

vijayawada@cipet.gov.in

Ph: 7229004049, 9440531978

ఇవి కూడా చదవండి

Pehalgam Terror Attack: ప్రధాని మోదీతో చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ భేటీ..

India Vs Pakistan: భారత్ సైనిక సమాచారం పాక్‌కు చేరవేత.. ఇద్దరి అరెస్ట్

Rahul Gandhi: సిక్కుల ఊచకోతపై రాహుల్ గాంధీ స్పందన

For National News And Telugu News

Updated Date - May 05 , 2025 | 04:27 AM