Hyderabad: కొడుకు మృతదేహం కోసం ఎదురుచూపులు..
ABN , Publish Date - Mar 07 , 2025 | 07:38 AM
అమెరికాలోని మిల్వాకీలో దుండగుల కాల్పుల్లో మృతి చెందిన తెలంగాణ విద్యార్థి గంప ప్రవీణ్ కడసారి చూపుకోసం చెమ్మగిల్లిన కళ్లతో తల్లిదండ్రులు ఎదురుచూస్తున్నారు.

- రెండు రోజుల క్రితం అమెరికాలో మృతి
- భారత్‌కు తరలించేందుకు తానా ఏర్పాట్లు
హైదరాబాద్: అమెరికాలోని మిల్వాకీ(Milwaukee)లో దుండగుల కాల్పుల్లో మృతి చెందిన తెలంగాణ విద్యార్థి గంప ప్రవీణ్(Gampa Praveen) కడసారి చూపుకోసం చెమ్మగిల్లిన కళ్లతో తల్లిదండ్రులు ఎదురుచూస్తున్నారు. మృతదేహాన్ని ఇండియాకు తరలించేందుకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా)కు అప్పగించారని, ఈమేరకు ఏర్పాట్లు చేస్తోందని మృతుడి తండ్రి గంప రాఘవులు గురువారం వెల్లడించారు. ఈ నెల 4న మిల్వాకీలో దుండగుల కాల్పుల్లో రంగారెడ్డి జిల్లా కేశంపేట మండల కేంద్రానికి చెందిన ప్రవీణ్ మృతి చెందిన విషయం విదితమే.
ఈ వార్తను కూడా చదవండి: GHMC: జీహెచ్‌ఎంసీలో వైఫై బంద్..
బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి(Union Minister Kishan Reddy) దృష్టికి ఈ విషయం తీసుకెళ్లాడు. కిషన్‌రెడ్డి స్పందిస్తూ త్వరలోనే ప్రవీణ్ మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించేందుకు కృషి చేస్తామని తెలిపారు. కొడుకు మృతదేహం కోసం ప్రవీణ్ తల్లితండ్రులు రాఘవులు, రమ ఎదురుచూస్తున్నారు. రెండు రోజులుగా కుమారుడి కోసం తల్లి రమ రోదిస్తున్న తీరు అందరనీ కలచివేస్తోంది.
ఈ వార్తను కూడా చదవండి: కొలంబియా అమ్మాయి.. తెలంగాణ అబ్బాయి
ఈ వార్తను కూడా చదవండి: Srisailam Dam: ముప్పు ముంగిట శ్రీశైలం!
ఈ వార్తను కూడా చదవండి: Transfers: భారీగా ఐఏఎస్, ఐపీఎస్ ల బదిలీలు!?
ఈ వార్తను కూడా చదవండి: ఆస్తి పన్ను వసూళ్లపై స్పెషల్ ఫోకస్
Read Latest Telangana News and National News