Share News

GHMC: జీహెచ్‌ఎంసీలో వైఫై బంద్‌..

ABN , Publish Date - Mar 07 , 2025 | 07:14 AM

జీహెచ్‌ఎంసీలో వైఫై సేవలు నిలిచిపోయాయి. మొబైల్స్‌లో వీడియోలు, రీల్స్‌ చూస్తూ విధి నిర్వహణ పట్ల ఉద్యోగులు నిర్లక్ష్యం చూపుతున్నారని గుర్తించిన కమిషనర్‌ ఇలంబరిది దీనిపై సీరియస్‌ అయ్యారు. ఐటీ విభాగం అధికారులను పిలిచి వైఫై పాస్‌వర్డ్‌లు మార్చాలని ఆదేశించారు.

GHMC: జీహెచ్‌ఎంసీలో వైఫై బంద్‌..

- పాస్‌వర్డ్‌లు మార్పించిన కమిషనర్‌

- ఉద్యోగులు రీల్స్‌, సినిమాలు చూస్తున్నారన్న ఫిర్యాదులతో చర్యలు

హైదరాబాద్‌ సిటీ: జీహెచ్‌ఎంసీ(GHMC)లో వైఫై సేవలు నిలిచిపోయాయి. మొబైల్స్‌లో వీడియోలు, రీల్స్‌ చూస్తూ విధి నిర్వహణ పట్ల ఉద్యోగులు నిర్లక్ష్యం చూపుతున్నారని గుర్తించిన కమిషనర్‌ ఇలంబరిది దీనిపై సీరియస్‌ అయ్యారు. ఐటీ విభాగం అధికారులను పిలిచి వైఫై పాస్‌వర్డ్‌(WiFi password)లు మార్చాలని ఆదేశించారు. దీంతో రెండు రోజులుగా ప్రధాన కార్యాలయంలోని అన్ని అంతస్తుల్లో వైఫై సేవలు వినియోగించేకునే పరిస్థితి లేకుండా పోయింది. పాస్‌వర్డ్‌ చెప్పాలంటూ ఉద్యోగులు ఐటీ అధికారుల వద్దకు పరుగులు తీస్తున్నారు. కమిషనర్‌ ఆదేశాల నేపథ్యంలో ఎవరికీ పాస్‌వర్డ్‌లు చెప్పబోమని ఐటీ వర్గాలు చెబుతున్నాయి.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: ఇల్లు విషయంలో వివాదం.. మారుతండ్రి దారుణ హత్య


అధికారులు అందుబాటులో ఉండేలా..

city2.2.jpg

జీహెచ్‌ఎంసీలో అధికారులు, ఉద్యోగుల పనితీరుపై కమిషనర్‌ ప్రత్యేక దృష్టి సారించారు. పారదర్శక పౌర సేవలు, మెరుగైన అభివృద్ధి, నిర్వహణ కోసం సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా సమయపాలన పాటించేలా సాంకేతిక హాజరు విధానం అందుబాటులోకి తీసుకువచ్చిన ఆయన సందర్శన వేళల్లో కార్యాలయంలో ఉండాల్సిందే అని స్పష్టం చేశారు. అయినా కొందరు ఆఫీసుల్లో ఉండడం లేదన్న సమాచారంతో విభాగాధిపతుల కార్యాలయాల వద్ద సీసీ కెమెరాలు(CCTV cameras) ఏర్పాటు చేయాలని ఆదేశించారు.


ఈ వార్తను కూడా చదవండి: కొలంబియా అమ్మాయి.. తెలంగాణ అబ్బాయి

ఈ వార్తను కూడా చదవండి: Srisailam Dam: ముప్పు ముంగిట శ్రీశైలం!

ఈ వార్తను కూడా చదవండి: Transfers: భారీగా ఐఏఎస్‌, ఐపీఎస్ ల బదిలీలు!?

ఈ వార్తను కూడా చదవండి: ఆస్తి పన్ను వసూళ్లపై స్పెషల్‌ ఫోకస్‌

Read Latest Telangana News and National News

Updated Date - Mar 07 , 2025 | 07:14 AM