Share News

Hyderabad: ఇన్‌స్టాగ్రామ్ అంతపని చేసిందన్నమాట.. ఏం జరిగిందంటే..

ABN , Publish Date - Sep 16 , 2025 | 07:01 AM

పెట్టుబడులపై ఇన్‌స్టాలో వచ్చిన ఓ రీల్‌ను చూసి.. వారిని కాంటాక్టు అయ్యాడు. ఇదే అదునుగా యాప్‌ నిర్వాహకులు పెట్టుబడుల పేరుతో రూ.9.65 లక్షలు ఆ వ్యక్తి నుంచి కొల్లగొట్టారు. డీసీపీ ధార కవిత తెలిపిన వివరాల ప్రకారం.. లక్డీకాపూల్‌కు చెందిన 46 ఏళ్ల వ్యక్తి ఇన్‌స్టా రీల్స్‌ చూస్తుండగా, నోమురా యాప్‌ ప్రమోషన్‌ వీడియో కనిపించింది.

Hyderabad: ఇన్‌స్టాగ్రామ్ అంతపని చేసిందన్నమాట.. ఏం జరిగిందంటే..

- ఇన్‌స్టా రీల్‌ చూసి పెట్టుబడులు.. రూ.9.65 లక్షలకు టోకరా

హైదరాబాద్‌ సిటీ: పెట్టుబడులపై ఇన్‌స్టాలో వచ్చిన ఓ రీల్‌ను చూసి.. వారిని కాంటాక్టు అయ్యాడు. ఇదే అదునుగా యాప్‌ నిర్వాహకులు పెట్టుబడుల పేరుతో రూ.9.65 లక్షలు ఆ వ్యక్తి నుంచి కొల్లగొట్టారు. డీసీపీ ధార కవిత(DCP Dhara Kavitha) తెలిపిన వివరాల ప్రకారం.. లక్డీకాపూల్‌కు చెందిన 46 ఏళ్ల వ్యక్తి ఇన్‌స్టా రీల్స్‌(Insta Reels) చూస్తుండగా, నోమురా యాప్‌ ప్రమోషన్‌ వీడియో కనిపించింది. ఆన్‌లైన్‌ పెట్టుబడులు, వ్యాపారం, తక్కువ సమయంలోనే లక్షలు ఎలా సంపాదించొచ్చు అనేది రీల్‌లో చూపించారు.


అది నిజమని నమ్మిన బాధితుడు అందులోని నంబర్లకు ఫోన్‌ చేశాడు. నేహా అయ్యర్‌ పేరుతో లైన్‌లోకి వచ్చిన మహిళ ట్రేడింగ్‌కు చెందిన వివరాలను వెల్లడించింది. అతడిని వెంటనే ఓ గ్రూపులో చేర్చింది. గ్రూపులో ఉన్నవాళ్లకు వస్తున్న లాభాలను చూసి ఆశ్చర్యపోయాడు. అతడు కూడా విడతల వారీగా రూ. 9,65,400 పెట్టుబడి పెట్టాడు.


city2.2.jpg

ఆ డబ్బుకు రూ.27,51,400 లాభాలు వచ్చినట్లు యాప్‌లో చూపించారు. వాటిని విత్‌ డ్రా చేసుకోవడానికి ప్రయత్నించగా ఆప్షన్‌ క్లోజ్‌ అయింది. ఆ డబ్బు తీసుకోవాలంటే మరో రూ.18 లక్షలు చెల్లించాలని డిమాండ్‌ చేయడంతో ఇదంతా సైబర్‌ మోసమని గుర్తించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.


ఈ వార్తలు కూడా చదవండి..

మళ్లీ తగ్గిన బంగారం ధరలు..కానీ వెండి మాత్రం

మొదటి పావుగంటలో రిజర్వేషన్లకు ఆధార్‌

ప్రైవేటు కాలేజీల ఆందోళనలకు సంపూర్ణ మద్దతు

Read Latest Telangana News and National News

Updated Date - Sep 16 , 2025 | 07:01 AM