Share News

క్రెడిట్‌ కార్డుకు ఫైన్‌ పడిందని..

ABN , Publish Date - May 13 , 2025 | 07:37 AM

ఎక్కడుంటారో తెలియదు.. ఎలా ఉంటారో తెలియదు. కానీ.. పెరిగిన టెక్నాలజీని వాడుకుంటూ రోజుకు లక్షల రూపాలయలను దోచేస్తున్నారు. నగరంంలో సైబర్ నేరగాళ్ల మోసాలకు అంతేలేకుండా పోతోంది. ప్రతి రోజూ ఈ తరహ మోసాలు జరుగుతూనే ఉన్నాయి.

క్రెడిట్‌ కార్డుకు ఫైన్‌ పడిందని..

- రూ.1.80 లక్షలు స్వాహా

హైదరాబాద్‌ సిటీ: క్రెడిట్‌ కార్డు(Credit card) వాడకపోవడం వల్ల ఫైన్‌ పడిందనే పేరుతో సైబర్‌ నేరగాళ్లు రూ.1.80 లక్షలు కొల్లగొట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నగరానికి చెందిన ప్రైవేట్‌ ఉద్యోగికి ఓ ఫోన్‌ వచ్చింది. ‘మీ క్రెడిట్‌కార్డును చాలా కాలంగా వాడకపోవడం వల్ల ఫైన్‌ పడింది’ అని చెప్పాడు. జరిమానా మాఫీ చేయిస్తానని నమ్మించి కార్డు నంబర్‌, సీవీవీ, ఓటీపీలూ తెలుసుకుని రూ.1.80లక్షలు కొట్టేశాడు. ఆలస్యంగా గుర్తించిన బాధితుడు సిటీ సైబర్‌ క్రైమ్‌(City Cyber ​​Crime) పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఈ వార్తను కూడా చదవండి: దారుణం.. ఆ విషయాన్ని మనసులో పెట్టుకొని చంపేశాడు.. ఏం జరిగిందంటే..


city2.jpg

ఈ వార్తలు కూడా చదవండి

Gold Rate Today: బంగారం కొనాలనుకునే వారికి గుడ్‌న్యూస్.. తగ్గిన బంగారం ధరలు

Maoists: గిరిజనుడిని హత్య చేసిన మావోయిస్టులు

Secret War Manual: యుద్ధంలో నడిపించిన రహస్య గైడ్‌

టోపీ పెట్టుకున్న కోడెనాగు..

Read Latest Telangana News and National News

Updated Date - May 13 , 2025 | 07:37 AM