SBI: ఎస్బీఐ నుంచి కొత్త స్కీం.. రూ. 250తో ఇన్వెస్ట్‌మెంట్ సిప్ ప్రారంభం
ABN , Publish Date - Feb 17 , 2025 | 08:27 PM
చిన్న, మధ్యస్థాయి ప్రజల కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) జన్‌నివేష్ SIP అనే కీలక పథకాన్ని ప్రారంభించింది. దీని ప్రకారం మీరు రూ. 250 నుంచే సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP)ను ప్రారంభించుకోవచ్చు. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.

పేద, మధ్య తరగతి ప్రజలను దృష్టిలో ఉంచుకుని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) మ్యూచువల్ ఫండ్ పోర్టుఫోలియోలో కొత్త పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం పేరు ‘జన్ నివేష్ (Jan Nivesh) SIP’. ఇందులో మీరు కేవలం రూ.250 నుంచే మైక్రో ఇన్వెస్ట్‌మెంట్ సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP)ను ప్రారంభించవచ్చు. ఇది మిమ్మల్ని ఆర్థికంగా ప్రోత్సహించేందుకు తోడ్పడుతుంది. అంతేకాదు ఈ పథకం ద్వారా ఎటువంటి లావాదేవీ రుసుములు తీసుకోబోమని సంస్థ ప్రకటించింది.
SBI Jan Nivesh SIP ప్రత్యేకతలు
ఈ పథకం ప్రధానమైన అంశం ఏమిటంటే మీరు మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడిని కేవలం రూ. 250తో ప్రారంభించవచ్చు. ఇదివరకూ మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడిని పెట్టాలంటే కనీసం రూ. 500తో ప్రారంభించాల్సి ఉండేది. ఇప్పుడు ఇది వీధి వ్యాపారులు, చిన్న స్థాయి ఉద్యోగులు వంటి పేద వర్గాలకు కూడా అందుబాటులోకి రానుంది. తద్వారా ఈ సిప్ ఎంపిక చేసుకున్న వారు క్రమం తప్పకుండా పెట్టుబడి చేస్తే వారికి ఆర్థిక భరోసా లభించనుంది.
ఈ SIP ద్వారా ఎంత సృష్టించుకోవచ్చు
ఈ స్కీమ్ ద్వారా మీరు రూ. 250 పెట్టుబడి చేయడం ద్వారా ఎంత రాబడి వస్తుందనేది ఇక్కడ తెలుసుకుందాం. ఉదాహరణకు మీరు మీ చిన్నారి పుట్టినపుడు నెలకి కేవలం రూ. 250 చొప్పున పెట్టుబడి చేస్తే, దీనిని 25 సంవత్సరాల పాటు ఇనసాగించాలి. ఆ క్రమంలో మీకు సగటు 12% రాబడి వచ్చినట్లైతే, మీకు వచ్చే మొత్తం రూ.4,74,409 అవుతుంది. ఆ క్రమంలో మీ పెట్టుబడి రూ.75,000 మాత్రమే ఉంటుంది. కానీ మీకు వచ్చిన మొత్తం మాత్రం రూ. 4 లక్షలకుపైగా అవుతుంది. ఆ క్రమంలో మీరు వడ్డీ రూపంలోనే దాదాపు 4 లక్షల రూపాయలు పొందుతారు.
మ్యూచువల్ ఫండ్స్ వల్ల ప్రయోజనం
దీని ద్వారా వెనుకబడిన వర్గాలు మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఏ మేరకు పొందుతారో చెప్పేందుకు ఇది మంచి అవకాశమని నిపుణులు అన్నారు. గత 20 సంవత్సరాలలో మ్యూచువల్ ఫండ్స్ 15 నుంచి 20 రెట్లు ఎక్కువ రాబడిని ఇచ్చాయి. ఇదే సమయంలో ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD), పబ్లిక్ ప్రోవిడెంట్ ఫండ్ (PPF) లాంటి సంప్రదాయ పెట్టుబడి ఎంపికలు కేవలం 4 నుంచి 5 రెట్లు మాత్రమే లాభాలను అందించాయి. మరోవైపు భారత స్టాక్ మార్కెట్లో ప్రస్తుతం నెలకొన్న గందరగోళం వల్ల పెట్టుబడిదారులు ఆందోళన చెందుతున్నారు.
ఇవి కూడా చదవండి:
Viral News: పార్లమెంటులో అబద్ధం చెప్పిన ఎంపీ.. ఫైన్ విధించిన కోర్టు, పదవి కూడా..
CBSE Board Exam 2025: సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్ష పేపర్ లీక్.. బోర్డ్ క్లారిటీ
New FASTag Rules: ఫాస్టాగ్ యూజర్లకు అలర్ట్.. ఇవి పాటించకుంటే ఫైన్..
New Delhi: ఇళ్ల ధరల పెరుగుదలలో టాప్ 15 నగరాలు.. ఇండియా నుంచి..
BSNL: రీఛార్జ్‌పై టీవీ ఛానెల్‌లు ఉచితం.. క్రేజీ ఆఫర్
Read More Business News and Latest Telugu News