Share News

LIC launch 2 schemes: ఎల్ఐసీ దీపావళి ధమాకా..మహిళల కోసం 2 సూపర్ స్కీమ్స్

ABN , Publish Date - Oct 15 , 2025 | 05:03 PM

పిల్లల, మహిళలు, వృద్ధులు ఇలా అన్ని వర్గాల వారికి ఎల్ఐసీ వివిధ పథకాలను అందుబాటులో ఉంచింది. తాజాగా దీపావళి ధీమాకాగా ఎల్ఐసీ రెండు సూపర్ స్కీమ్స్ ను ప్రకటించింది. అయితే ఇక్కడ ఓ ట్విస్ట్ ఉంది.

LIC launch 2 schemes:  ఎల్ఐసీ దీపావళి ధమాకా..మహిళల కోసం 2 సూపర్ స్కీమ్స్
LIC

దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(LIC) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్నో రకాల సేవలు అందిస్తూ ప్రజల్లో మంచి స్థానం సంపాదించింది. అందుకే ఎల్ఐసీ నుంచి ఎటువంటి సమాచారం వచ్చినా చూసేందుకు జనం ఆసక్తి చూపిస్తుంటారు. ఇదే సమయంలో ప్రజలను ఆకట్టుకునేందుకు ఎల్ఐసీ సంస్థ కూడా తరచూ ఏదో ఒక స్కీమ్ ప్రకటిస్తుంది.

పిల్లల, మహిళలు, వృద్ధులు ఇలా అన్ని వర్గాల వారికి ఎల్ఐసీ వివిధ పథకాలను అందుబాటులో ఉంచింది. తాజాగా దీపావళి ధీమాకాగా ఎల్ఐసీ రెండు సూపర్ స్కీమ్స్ ను ప్రకటించింది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. వీటిల్లో ఓ పథకం కేవలం మహిళలకు మాత్రమే. ఇక ఆ రెండు స్కీమ్స్ ఏంటి, వాటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..


ఎల్ఐసీ సంస్థ జన సురక్ష (ప్లాన్‌ 880), బీమా లక్ష్మి (ప్లాన్‌ 881) పేరుతో రెండు ప్లాన్లను(LIC new schemes 2025) తీసుకొచ్చింది. నేటి(అక్టోబర్‌ 15) నుంచి ఈ రెండు పాలసీలు కొనుగోలుకు అందుబాటులో ఉంటాయి. తక్కువ ఆదాయం ఉన్న వారి కోసం ‘జన సురక్ష’ను తీసుకురాగా.. ‘బీమా లక్ష్మి’(Bima Lakshmi) కేవలం మహిళల కోసం ఉద్దేశించినది. అందరికీ బీమా కల్పించాలన్న ఉద్దేశంతో తక్కువ ధరలో జన సురక్ష ప్లాన్‌ను(Jan Suraksha) ఎల్‌ఐసీ ప్రారంభించింది.

జన సురక్ష ప్లాన్‌ను నాన్‌ పార్టిసిపేటింగ్‌, నాన్‌ లింక్డ్‌ ఇన్సూరెన్స్‌ స్కీమ్‌. అంటే ఇది మార్కెట్‌కు అనుసంధానమై ఉండదు. బోనస్‌ చెల్లింపులూ ఉండవు. మైక్రో ఇన్సూరెన్స్(Micro Insurance) కావడంతో ఇక్కడ తక్కవ ప్రీమియంతో ఆర్థికంగా బలహీన వర్గాల వారికి రక్షణ కల్పిస్తోంది. 18-55 ఏళ్ల వయసున్నవారు ఎవరైనా ఈ ప్లాన్‌ ఎంచుకోవచ్చు. కనీస బీమా హామీ మొత్తం రూ.లక్ష కాగా.. గరిష్ఠంగా రూ.2 లక్షల వరకు ఎంచుకోవచ్చు.


'బీమా లక్ష్మి' (Bima Lakshmi )ప్లాన్ మహిళలకు బీమా సదుపాయం కల్పించాలన్న ముఖ్య ఉద్దేశంతో తీసుకొచ్చింది. ఇందులో బీమా, పొదుపు రెండూ ఉంటాయి. ఇది కూడా జన సురక్ష మాదిరిగానే నాన్‌ పార్టిసిపేటింగ్‌, నాన్‌ లింక్డ్‌ స్కీమ్‌. అంటే మార్కెట్‌ ఒడిదుడుకులతో సంబంధం లేదు. పైగా బోనస్‌ చెల్లింపులు ఉండవు. ఈ ప్లాన్ లో మూడు రకాల ఆప్షన్‌లు ఉంటాయి. ఎంచుకున్న ఆప్షన్‌ బట్టి హామీ మొత్తాన్ని విడతల వారీగా లబ్దిదారులు పొందొచ్చు. ఇందులో కనీస బీమా(LIC) హామీ మొత్తం రూ.2 లక్షలు కాగా.. గరిష్ఠ మొత్తంపై పరిమితి లేదు.18 ఏళ్ల నుంచి 50 ఏళ్లు వయస్సు మహిళలు ఈ ప్లాన్ కు అర్హులు. దీనికి సంబంధించి పూర్తి వివరాలకు ఎల్ఐసీ‌కి(LIC) సంబంధించిన అధికారిక వెబ్ సైట్‌లో చూడవచ్చు.


ఇవి కూడా చదవండి..

మావోయిస్టు పార్టీకి బిగ్ షాక్.. 27 మంది లొంగుబాటు

బెదిరింపులు నాకేం కొత్త కాదులే.. ఆర్‌ఎస్‌ఎస్‌పై ఇక పోరాటమే..

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Oct 15 , 2025 | 05:39 PM