Pankaj Dheer: పంకజ్‌ధీర్ చేజారిన అర్జునుడి పాత్ర.. ఏం జరిగిందంటే..
ABN , Publish Date - Oct 15 , 2025 | 04:28 PM
బీఆర్ చోప్రా మహాభారత్‌లో మొదట అర్జునుడి పాత్రకు పంకజ్ ధీర్‌నే అనుకున్నారు. అయితే ఒక ప్రత్యేక కారణంతో ఆ పాత్ర ఆయన చేజారిపోయింది.
ముంబై: బీఆర్ చోప్రా 'మహాభారత్' (Maha Bharat) టీవీ సీరియల్ (1988)లో కర్ణుడిగా నటించిన పంకజ్ ధీర్ (Pankaj Dheer) ఆ పాత్రతో ఒక్కసారిగా పాపులర్ అయ్యారు. అప్పటివరకూ సినిమాల్లో చిన్నచిన్న పాత్రలకే పరిమితమైన ఆయన అటు పెద్దతెరపైనే కాకుండా చిన్నతెరపైనా బిజీ అయ్యారు. పొడగరి కావడం, పవర్‌ఫుల్‌గా డైలాగ్స్ చెప్పడంలో దిట్ట కావడంతో ఆయన నటుడిగా తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. మహాభారత్‌లో మొదట అర్జునుడి (Arjun) పాత్రకు పంకజ్ ధీర్‌నే అనుకున్నారు. అయితే ఒక ప్రత్యేక కారణంతో ఆ పాత్ర ఆయన చేజారిపోయింది. 2023లో ఆయనే స్వయంగా ఒక ఇంటర్వ్యూలో ఆ విషయం చెప్పారు.
'అర్జునుడి పాత్రకు నేను బాగా సరిపోతానని అంతా అనుకోవడంతో 2-3 నెలలు కాంట్రాక్ట్ కుదిరింది. నన్ను పిలిపించారు. బృహన్నల పాత్ర కోసం మీసం తీసేయాలని చెప్పారు. అయితే మీసం తీయడం కుదరదని తెగేసి చెప్పాను. ఎందుకంటే.. మీసం తీసేస్తే నా ముఖం చూడటానికి అస్సలు బాగుండదు. చోప్రా సార్‌కు కోపం వచ్చింది. గెట్ ఔట్ చెప్పారు. కాంట్రాక్టు రద్దయింది. అప్పట్లో నేను చాలా చిన్న పిల్లాడిని. అయితే విధి అనేది ఒకటి ఉంటుంది కదా. సరిగ్గా 6 నెలల తర్వాత మళ్లీ చోప్రా సాబ్ మళ్లీ నన్ను పిలిచారు. కర్ణుడి పాత్ర ఆఫర్ చేశారు. అప్పుడు నేను ఆయనను ఒకే మాట అడిగాను. మీసం తీసేయాలా సార్ అని. అక్కర్లేదని ఆయన నవ్వుతూ చెప్పారు. దాంతో వెంటనే వేషం ఒప్పేసుకున్నాను' అని పంకజ్ ధీర్ ఆ ఇంటర్వ్యూలో తెలిపారు.
పంకజ్ ధీర్ 68 ఏళ్ల వయస్సులో క్యాన్సర్‌తో చికిత్సపొందుతూ బుధవారం ఉదయం కన్నుమూశారు. ఆయనకు భార్య అనితా ధీర్, కుమారుడు నికితన్ ధీర్ ఉన్నారు. నికితిన్ ధీర్ కూడా పలు హిందీ చిత్రాల్లో మంచిపేరు తెచ్చుకున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Pankaj Dheer: మహాభారత్ కర్ణుడు పంకజ్ ధీర్ కన్నుమూత
మావోయిస్టు పార్టీకి బిగ్ షాక్.. 27 మంది లొంగుబాటు
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి