Share News

Priyank Kharge: బెదిరింపులు నాకేం కొత్త కాదులే.. ఆర్‌ఎస్‌ఎస్‌పై ఇక పోరాటమే..

ABN , Publish Date - Oct 15 , 2025 | 01:52 PM

ఆర్‌ఎస్ఎస్ కు సంబంధించి తాను చేసిన వ్యాఖ్యలపై బెదిరింపు కాల్స్‌ వస్తున్నాయని, ఇవి తమ కుటుంబానికి కొత్తవి కాదని, తన పోరాటాన్ని ఆపేది లేదని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కుమారుడు, కర్ణాటక ఐటీబీటీ శాఖల మంత్రి ప్రియాంక్ ఖర్గే అన్నారు.

Priyank Kharge: బెదిరింపులు నాకేం కొత్త కాదులే.. ఆర్‌ఎస్‌ఎస్‌పై ఇక పోరాటమే..

- మంత్రి ప్రియాంక ఖర్గే

- కర్రలతో తిరిగితే వదిలేయాలా..?

- అంబేడ్కర్‌ వాదులమంతా నీలం చొక్కాలతో గుంపు కడతామంటూ హెచ్చరిక

బెంగళూరు: ఆర్‌ఎస్ఎస్ కు సంబంధించి తాను చేసిన వ్యాఖ్యలపై బెదిరింపు కాల్స్‌ వస్తున్నాయని, ఇవి తమ కుటుంబానికి కొత్తవి కాదని, తన పోరాటాన్ని ఆపేది లేదని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కుమారుడు, కర్ణాటక ఐటీబీటీ శాఖల మంత్రి ప్రియాంక్ ఖర్గే అన్నారు. బెంగళూరులో ఆయన మీడియాతో మాట్లాడిన ఆయన.. గత ప్రభుత్వంలోనూ మా ధ్వని వినిపించినప్పుడు బెదరింపు కాల్స్‌ వచ్చాయన్నారు. నా తండ్రి మల్లికార్జున ఖర్గేకు ల్యాండ్‌లైన్‌కు ఫోన్‌ చేసి పలుమార్లు బెదరించారన్నారు. ఇప్పటికీ సఫ్దర్‌జంగ్‌ పోలీస్ స్టేషన్‌లో కేసు కొనసాగుతోందన్నారు.


బెంగళూరు సదాశివనగర్‌ ఇంటి ల్యాండ్‌లైన్‌కు పలుమార్లు ఫోన్‌ వచ్చిందన్నారు. ఇటువంటి బెదరింపు కాల్స్‌కు భయపడేది లేదన్నారు. తనకు మాత్రం నిరంతరంగా వాట్స్‌పకాల్స్‌, హెచ్చరికలు వస్తూనే ఉంటాయన్నారు. ఎఫ్‌ఐఆర్‌ నమోదుకు అవకాశం ఉన్నా ఇవి ఎన్‌క్రిప్టిడ్‌ కాల్‌ కావడంతో ఎక్కడనుంచి వచ్చాయనేది గుర్తించడం కష్టతరమన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు భయపడలేదని అధికారంలో ఉన్నప్పుడు వెనకడుగు వేయడం ఎందుకన్నారు. ఆర్‌ఎ్‌సఎస్‌ కొన్ని సంఘాలు తత్వసిద్ధాంతాల గురించి మండిపడ్డారు. నూరేళ్లకిందటే ఇలాంటి బెదిరింపులు ఉన్నాయన్నారు.


మహాత్మాగాంధీని బలిగొన్నారని, అంబేడ్కర్‌ను ముగించేందుకు ప్రయత్నించారన్నారు. ఆర్‌ఎస్ఎస్‏కు వందేళ్ల చరిత్ర ఉంటే కాంగ్రెస్‌ 135 ఏళ్ల చరిత్ర కల్గిన పార్టీ అన్నారు. తాను ఒంటరి కాదని, సిద్ధాంతాల ఆధారంగా ఉంటాయన్నారు. బుద్ధ, బసవ, అంబేడ్కర్‌ సిద్ధాంతాలు పాటిస్తామని, రాజ్యాంగంపై అపార నమ్మకం ఉందన్నారు. ఆర్‌ఎ్‌సఎస్‌ తత్వ సిద్ధాంతాలలో అందరికీ అవకాశం లేదన్నారు. బహిరంగ ప్రదేశాలలో ఏ కార్యక్రమం జరపాలన్నా అనుమతులు అవసరమని, ఏ పార్టీకైనా ఈ నిబంధన ఉంటుందన్నారు. పదిమంది కర్రలు పట్టుకుని రోడ్డెక్కుతామంటే అనుమతులు ఉండాలన్నారు.


zzzzzzzzzzzzzzzzzzz.jpg

కర్రలు తిప్పుతూ వస్తుంటే ప్రభుత్వం మౌనంగా ఉండాలా... అన్నారు. తాను పిలుపునిచ్చి అంబేడ్కర్‌ వాదులంతా నీలం చొక్కాలతో కర్రలు పట్టుకుని ఊరేగుతామంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటుందా..? అంటూ ప్రశ్నించారు. వారికెందుకు మినహాయింపు అని ప్రశ్నించారు. కొన్ని పోరాటాలు సమైక్యంగా చేయాల్సి ఉంటుందని, మరికొన్ని ఒంటరిగా చేయాల్సి ఉంటుందన్నారు. కర్ణాటక ఉనికిని కాపాడుకునే విషయంలో అందరూ ఒక్కటి కావాలన్నారు. నా వ్యాఖ్యల తర్వాత సీఎం, డీసీఎం, మంత్రులు సంతోష్ లాడ్‌, దినేశ్‌ గుండూరావు మాట్లాడారన్నారు. పోరాటం తమ హక్కు అన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఆ మూడు దగ్గు మందులు ప్రమాదకరం

షాకింగ్‌ .. ఎమ్‌టీవీ మ్యూజిక్‌ ఛానల్‌ మూసివేత

Read Latest Telangana News and National News

Updated Date - Oct 15 , 2025 | 03:24 PM