Gold Prices on Dec 30: స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు.. నేటి రేట్లు ఇవే..
ABN , Publish Date - Dec 30 , 2025 | 07:07 AM
దేశంలో పసిడి, వెండి ధరలు దాదాపు స్థిరంగా ఉన్నాయి. సోమవారంతో పోలిస్తే నేడు ధరల్లో స్వల్ప తగ్గుదల నమోదైంది. ప్రస్తుతం.. మార్కెట్లో పసిడి, వెండి ధరల వివరాలను ఓసారి పరిశీలిస్తే..
ఇంటర్నెట్ డెస్క్: మంగళవారం రోజు దేశంలో బంగారం, వెండి రేట్లు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి(Gold and Silver Rates Today). గుడ్ రిటర్న్ వెబ్‌సైట్ ప్రకారం.. సోమవారంతో పోలిస్తే నేటి మార్కెట్లలో 24 క్యారెట్ల ఒక గ్రాము పసిడిపై ఒక్క రూపాయి పతనమై.. 10 గ్రాముల ధర రూ.1,39,240కి చేరింది. 22 క్యారెట్ల ఒక గ్రాము ఆర్నమెంట్ బంగారంపై కూడా రూపాయి మేర తగ్గి.. 10 గ్రాములకు రూ.1,27,640కి చేరుకుంది. 18 క్యారెట్ల ఒక గ్రాము బంగారంపై ఇదే స్థాయిలో తగ్గుదల నమోదై.. రూ.1,04,430కి చేరింది(Gold Rates on Dec 30).
ఇక.. ఇటీవలి కాలంలో భారీ స్థాయిలో దూసుకుపోతున్న వెండి రేట్లు సోమవారం కాస్త డీలాపడి, స్వల్పంగా పతనమయ్యాయి. కిలో వెండిపై రూ.100 మేర తగ్గి రూ.2,80,900లకు చేరుకుంది(Silver Rates on Dec 30).
ఏడాది కాలంగా భారీ స్థాయిలో పెరుగుదల కనబర్చిన పసిడి, వెండి ధరల్లో సోమవారం గణనీయ దిద్దుబాటు ఏర్పడింది. అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు తగ్గుముఖం పడతాయనే అంచనాలు, వెండిపై చైనా ఎగుమతి ఆంక్షల నేపథ్యంలో.. అంతర్జాతీయంగా కమొడిటీ ఎక్స్ఛేంజీల్లో వీటి కాంట్రాక్టుల్లో మదుపర్లు లాభాలు స్వీకరించడమే ఇందుకు కారణమని విశ్లేషకులు పేర్కొన్నారు. గత వారంలో పుత్తడి, వెండి ధరలు అనూహ్యంగా ఎగబాకగా.. అమెరికా, ఉక్రెయిన్ దేశాల మధ్య చర్చల ఆరంభంతో ఇలా రేట్లు పతనమవడం గమనార్హం.
ఆయా ప్రధాన నగరాల్లో బంగారం(24కే, 22కే, 18కే) ధరల వివరాలిలా..
చెన్నై: ₹1,42,030; ₹1,30,190; ₹1,08,640
ముంబై: ₹1,39,240; ₹1,27,764; ₹1,04,430
న్యూఢిల్లీ: ₹1,39,390; ₹1,27,790; ₹1,04,580
కోల్‌కతా: ₹1,39,240; ₹1,27,640; ₹1,04,430
బెంగళూరు: ₹1,39,240; ₹1,27,640; ₹1,04,430
హైదరాబాద్: ₹1,39,240; ₹1,27,640; ₹1,04,430
విజయవాడ: ₹1,39,240; ₹1,27,640; ₹1,04,430
కేరళ: ₹1,39,240; ₹1,27,640; ₹1,04,430
పుణె: ₹1,39,240; ₹1,27,640; ₹1,04,430
అహ్మదాబాద్: ₹1,39,290; ₹1,27,690; ₹1,04,480
పలు ప్రముఖ నగరాల్లో వెండి(కిలో) రేట్ల వివరాలిలా..
చెన్నై: ₹2,80,900
ముంబై: ₹2,57,900
న్యూఢిల్లీ: ₹2,57,900
కోల్‌కతా: ₹2,57,900
బెంగళూరు: ₹2,57,900
హైదరాబాద్: ₹2,80,900
విజయవాడ: ₹2,80,900
కేరళ: ₹2,80,900
పుణె: ₹2,57,900
అహ్మదాబాద్: ₹2,57,100
గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు మార్కెట్లలో ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. కాబట్టి.. కొనుగోలుదారులు మరోసారి ధరలను పరిశీలించగలరు.
ఇవీ చదవండి: