Stock Market: ఆరంభ లాభాలు ఆవిరి.. నష్టాలతోనే ముగిసిన సూచీలు..
ABN , Publish Date - Dec 29 , 2025 | 04:19 PM
గత సెషన్‌లో విదేశీ మదుపర్లు మాత్రం రూ.317 కోట్ల విలువైన షేర్లను అమ్మేశారు. అలాగే సంవత్సరాంతం కావడంతో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరించి కొనుగోళ్లకు దూరంగా ఉన్నారు. అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాలు కూడా మార్కెట్లను వెనక్కి లాగాయి.
విదేశీ మదుపర్లు అమ్మకాలకు మొగ్గు చూపడం, క్రూడాయిల్ ధరలు పెరగడం దేశీయ సూచీలపై నెగిటివ్ ప్రభావాన్ని చూపించాయి. గత సెషన్‌లో విదేశీ మదుపర్లు మాత్రం రూ.317 కోట్ల విలువైన షేర్లను అమ్మేశారు. అలాగే సంవత్సరాంతం కావడంతో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరించి కొనుగోళ్లకు దూరంగా ఉన్నారు. అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాలు కూడా మార్కెట్లను వెనక్కి లాగాయి. దీంతో సెన్సెక్స్, నిఫ్టీ నష్టాలతో రోజును ముగించాయి (Indian stock market).
గత సెషన్ ముగింపు (85, 041)తో పోల్చుకుంటే సోమవారం ఉదయం ఫ్లాట్‌గా మొదలైన సెన్సెక్స్ మధ్యాహ్నం వరకు లాభాల్లోనే కదలాడింది. ఒక దశలో 250 పాయింట్లకు పైగా లాభపడి 85, 250 వద్ద ఇంట్రాడే గరిష్టానికి చేరుకుంది. అయితే మధ్యాహ్నం తర్వాత అమ్మకాలు మొదలయ్యాయి. చివరకు సెన్సెక్స్ 345 పాయింట్ల నష్టంతో 84, 695 వద్ద రోజును ముగించింది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడింది. చివరకు 100 పాయింట్ల నష్టంతో 25, 942 వద్ద స్థిరపడింది. మళ్లీ 26 వేల దిగువకు పడిపోయింది (stock market news today).
సెన్సెక్స్‌లో హెచ్‌ఎఫ్‌సీఎల్, హడ్కో, టాటా స్టీల్, టాటా కన్జ్యూమర్ ప్రోడక్ట్స్, ఎన్‌సీసీ మొదలైన షేర్లు లాభాలు ఆర్జించాయి (share market news). ఐఆర్‌ఎఫ్‌సీ, రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్, డిక్సన్ టెక్నాలజీస్, ఏంజెల్ వన్, హిందుస్థాన్ జింక్ మొదలైన షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి. బ్యాంక్ నిఫ్టీ 79 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 313 పాయింట్లు నష్టపోయింది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 89.97గా ఉంది.
ఇవి కూడా చదవండి..
బట్టలు లేకుండా తాగుతూ, తూగుతూ.. బ్రిటన్‌లో వెరైటీ న్యూ ఇయర్ పార్టీ..
మీ కళ్లు పవర్‌ఫుల్ అయితే.. ఈ Qల మధ్యలో O ఎక్కడుందో 15 సెకెన్లలో కనిపెట్టండి..