Share News

Viceroy Hotels Acquisition: వైస్రాయ్‌ హోటల్స్‌ చేతికి ఎస్‌ఎల్‌ఎన్‌ టెర్మినస్‌ హోటల్స్‌

ABN , Publish Date - Dec 30 , 2025 | 07:03 AM

హైదరాబాద్‌లోని ఎస్‌ఎల్‌ఎన్‌ టెర్మినస్‌ హోటల్స్‌ అండ్‌ రిసార్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ను రూ.206 కోట్లకు కొనుగోలు చేయనున్నట్లు వైస్రాయ్‌ హోటల్స్‌ లిమిటెడ్‌ ప్రకటించింది...

Viceroy Hotels Acquisition: వైస్రాయ్‌ హోటల్స్‌ చేతికి ఎస్‌ఎల్‌ఎన్‌ టెర్మినస్‌ హోటల్స్‌

డీల్‌ విలువ రూ.206 కోట్లు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): హైదరాబాద్‌లోని ఎస్‌ఎల్‌ఎన్‌ టెర్మినస్‌ హోటల్స్‌ అండ్‌ రిసార్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ను రూ.206 కోట్లకు కొనుగోలు చేయనున్నట్లు వైస్రాయ్‌ హోటల్స్‌ లిమిటెడ్‌ ప్రకటించింది. ఈ మేరకు ఎస్‌ఎల్‌ఎన్‌ ప్రమోటర్లతో అవగాహనా ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపింది. ఎస్‌ఎల్‌ఎన్‌ టెర్మినస్‌ గచ్చిబౌలిలో మారియట్‌ బ్రాండ్‌ పేరుతో 75 గదులతో మారియట్‌ ఎగ్జిక్యూటివ్‌ అపార్ట్‌మెంట్స్‌ను నిర్వహిస్తోంది. 2030 నాటికి గదుల సంఖ్యను 1,000కి చేర్చాలన్న విజన్‌కు అనుగుణంగా ఈ కొనుగోలును చేపట్టినట్లు వైస్రాయ్‌ తెలిపింది. కాగా ఎస్‌ఎల్‌ఎన్‌కు సమీపంలోనే మాదాపూర్‌ వద్ద 200 రూములతో కోర్ట్‌యార్డ్‌ బై మారియట్‌ ప్రాజెక్ట్‌ను ఇప్పటికే అభివృద్ధి చేస్తోంది. ప్రస్తుతం వైస్రా య్‌ హోటల్స్‌ పోర్టుఫోలియోలో 470 రూములున్నాయి. 2024-25లో ఎస్‌ఎల్‌ఎన్‌ టెర్మినస్‌ టర్నోవర్‌ రూ.43.45 కోట్లుగా ఉండగా నికర లాభం రూ.5.98 కోట్లుగా ఉంది.

Also Read:

Melbourne Pitch: మెల్‌బోర్న్ పిచ్‌కు ఐసీసీ రేటింగ్.. ఏమిచ్చిందంటే..?

Ibomma Ravi: ముగిసిన ఐబొమ్మ రవి కస్టడీ విచారణ.. కీలక వివరాలు సేకరించిన పోలీసులు..

Minister Rama Prasad: రాయచోటితో నాకు ప్రత్యేక అనుబంధం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Updated Date - Dec 30 , 2025 | 07:03 AM