Share News

Gold from Old Phones: పాత ఫోన్‌ పడేస్తున్నారా..ఫ్రీగా వచ్చే బంగారాన్ని మిస్ అయినట్లే..!

ABN , Publish Date - Aug 19 , 2025 | 05:27 PM

మీ పాత మొబైల్ ఫోన్ లేదా కంప్యూటర్‌ పాతబడిపోయిందని పడేస్తున్నారా. అయితే ఆగండి ఆగండి. ఎందుకంటే రానున్న రోజుల్లో వీటికి మంచి డిమాండ్ వచ్చే ఛాన్సుంది. ఎందుకంటే పాత ఫోన్, ల్యాప్‎ట్యాప్ నుంచి బంగారం తీస్తున్నారంటా. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.

Gold from Old Phones: పాత ఫోన్‌ పడేస్తున్నారా..ఫ్రీగా వచ్చే బంగారాన్ని మిస్ అయినట్లే..!
Gold from Old Phones

మీ పాత మొబైల్ ఫోన్ లేదా కంప్యూటర్‌ని చూస్తే, ఇది ఇప్పుడు వేస్ట్ అని పడేయాలనిపిస్తుందా. కానీ ఒక్కసారి ఆగండి. ఎందుకంటే ఆ పాత వాటి నుంచి ఇప్పుడు బంగారం తీస్తున్నారు. అవును, మీరు విన్నది నిజమే. శాస్త్రవేత్తలు గోల్డ్ కోసం ఒక అద్భుతమైన, పర్యావరణ హితమైన మార్గాన్ని కనిపెట్టారు. దీంతో మన పాత ఎలక్ట్రానిక్ వస్తువుల నుంచి బంగారం తీసి, పర్యావరణానికి మేలు చేయనున్నారు. ఈ సరికొత్త ఆవిష్కరణ గురించి ఓ జర్నల్‌ ప్రకటించింది. ఆ విశేషాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.


ఎలక్ట్రానిక్ వేస్ట్

మనం రోజూ స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, టీవీలు.. ఇలా ఎన్నో ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లు వినియోగిస్తున్నాం. కొత్త టెక్నాలజీ వస్తుంటే, పాతవి పడేస్తున్నాం. దీనివల్ల ఏం జరుగుతుంది? ఎలక్ట్రానిక్ వేస్ట్ (ఈ-వేస్ట్) పేరుకుపోతోంది.

UN Global E-waste Monitor 2024 రిపోర్ట్ ప్రకారం, 2022లో ప్రపంచవ్యాప్తంగా 6.2 కోట్ల టన్నుల ఈ-వేస్ట్ ఉత్పత్తి అయింది. ఇది 2010తో పోలిస్తే 82% ఎక్కువ. ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే, 2030 నాటికి ఈ సంఖ్య 8.2 కోట్ల టన్నులకు చేరనుంది. ఇంత ఈ-వేస్ట్‌ని ఒక చోట పేర్చితే, భూమి చుట్టూ 40 టన్నుల ట్రక్కులు 1.55 మిలియన్లు క్యూ కడతాయి.


విలువైన వనరులు..

అయితే ఈ వేస్ట్ కేవలం చెత్త మాత్రమే కాదు. దీనిలో బంగారం, వెండి, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ లాంటి విలువైన వనరులు కూడా ఉన్నాయి. కానీ ప్రపంచంలో కేవలం 1% రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ మాత్రమే రీసైక్లింగ్ ద్వారా తిరిగి వస్తున్నాయి. మిగిలినవి? వేస్ట్‌గా పోతున్నాయి. అంతేకాదు, సాంప్రదాయ బంగారం తీసే పద్ధతులు పర్యావరణానికి హాని చేస్తాయి, రిస్క్‌తో కూడుకున్నవి. ఇక్కడే ఈ కొత్త ఆవిష్కరణ వెలుగులోకి వచ్చింది.


బంగారం తీయడం ఇంత సులభమా?

శాస్త్రవేత్తలు కనిపెట్టిన ఈ కొత్త పద్ధతి పాత ఫోన్లు, కంప్యూటర్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువుల నుంచి బంగారం తీయడానికి ఈజీ మార్గంగా మారింది. ఈ ప్రాసెస్‌లో కఠినమైన కెమికల్స్ అవసరం లేదు, పర్యావరణానికి హాని కూడా తక్కువ. ఈ పద్ధతిలో మూడు విధాలుగా బంగారాన్ని ప్రాసెస్ చేస్తున్నారు. ఈ-వేస్ట్‌లోని బంగారాన్ని కరిగించడానికి trichloroisocyanuric acid అనే కెమికల్ వాడతారు. ఇది సాధారణంగా స్విమ్మింగ్ పూల్స్‌లో డిస్‌ఇన్ఫెక్టెంట్‌గా ఉపయోగిస్తారు. దీనికి ఒక హాలైడ్ క్యాటలిస్ట్ యాడ్ చేసి బంగారాన్ని ఆక్సిడైజ్ చేస్తారు.

ఇక్కడ ఒక కొత్త రకం పాలీసల్ఫైడ్ పాలిమర్ సోర్బెంట్ వినియోగిస్తారు. ఈ పాలిమర్ కరిగిన బంగారాన్ని మాత్రమే ఎంచుకొని, సొల్యూషన్ నుంచి గ్రహిస్తుంది. ఈ బంగారం-బైండ్ అయిన పాలిమర్‌ని పైరోలిసిస్ లేదా డీపాలిమరైజేషన్ ద్వారా బంగారాన్ని చాలా హై ప్యూరిటీలో తీస్తారు. ఈ పాలిమర్‌ని రీసైకిల్ చేసి మళ్లీ వాడుకోవచ్చు.


ఇవి కూడా చదవండి

అర్జెంటుగా డబ్బు అవసరం.. పర్సనల్ లోన్ తీసుకోవాలా? గోల్డ్ బెటరా?

మీ లోన్ ఇంకా మంజూరు కాలేదా..ఇవి పాటించండి, వెంటనే అప్రూవల్

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 19 , 2025 | 05:29 PM