Share News

EPFO Alert: వారి మాటలు నమ్మి మోసపోవద్దు.. EPFO చందా దారులకు అలర్ట్..

ABN , Publish Date - Aug 19 , 2025 | 04:44 PM

ఇటీవల కాలంలో ఆర్థిక మోసాలు ఎక్కువవుతున్నాయి. ఈ నేపథ్యంలో పీఎఫ్ సభ్యులు కూడా టార్గెట్ అవుతున్నారు. మీ పీఎఫ్ డబ్బులు విత్‌డ్రా చేయిస్తామని దుండగులు లేదా పలు కన్సల్టెంట్లు వ్యక్తిగత సమాచారం సేకరించి మోసం చేస్తున్నాయి. విషయం తెలిసిన పీఎఫ్ సంస్థ సభ్యులకు కీలక సూచనలు జారీ చేసింది.

EPFO Alert: వారి మాటలు నమ్మి మోసపోవద్దు.. EPFO చందా దారులకు అలర్ట్..
EPFO Alert

ఇటీవల కాలంలో మనీ మోసాలు ఎక్కువయ్యాయి. ఈ క్రమంలో పలువురు దుండగులు పీఎఫ్ సభ్యులను కూడా వదలడం లేదు. మీ మనీ విత్ డ్రా చేయిస్తామని చెప్పి చీట్ చేస్తున్నారు. దీంతోపాటు పలు కన్సల్టెంట్లు కూడా తప్పుడు సమాచారం ఇచ్చి మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. వీటి గురించి తెలిసిన EPFO.. పీఎఫ్ సభ్యులకు కీలక సూచనలు జారీ చేసింది. అలాంటి వాళ్ల మాటలు నమ్మి మీ కష్టార్జితాన్ని కోల్పోవద్దని సూచించింది.


EPFO ఏం చెబుతోంది?

ఈ క్రమంలో కన్సల్టెంట్ల మాటలు నమ్మొద్దని EPFO స్పష్టం చేసింది. కొందరు మీ PF ఖాతా నుంచి డబ్బు తీసుకోవడానికి సహాయం చేస్తామని, త్వరగా డబ్బు వస్తుందని హామీ ఇస్తారు. కానీ, అలాంటి మాటల వెనుక మోసం ఉంటుందని ప్రస్తావించారు. మీరు నమ్మితే, మీ డబ్బు కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది. అందుకే, EPFO అధికారిక వెబ్‌సైట్ లేదా ఆఫీస్ ద్వారా మాత్రమే సేవలు పొందాలని తెలిపింది.


క్లెయిమ్ ప్రక్రియ ఇప్పుడు సులభం

EPFO చందాదారుల క్లెయిమ్ ప్రక్రియ ఇప్పుడు చాలా సులభతరం అయింది. గతంలో అడ్వాన్స్ క్లెయిమ్‌ల కోసం రూ. 1 లక్ష వరకు మాత్రమే ఆటో-సెటిల్‌మెంట్ సౌకర్యం ఉండేది. కానీ ఇప్పుడు ఈ పరిమితిని రూ. 5 లక్షలకు పెంచారు. అంటే, మీకు అత్యవసరంగా డబ్బు అవసరమైతే, ఎక్కువ మొత్తం కూడా పొందవచ్చు.

ఆటో-సెటిల్‌మెంట్ సౌకర్యం మొదట కోవిడ్-19 సమయంలో ప్రవేశపెట్టారు. అప్పటి నుంచి దీన్ని అనారోగ్యం, విద్య, వివాహం, హౌసింగ్ వంటి అడ్వాన్స్ క్లెయిమ్‌లకు విస్తరించారు. ఈ క్లెయిమ్‌లు ఆటోమేటిక్‌గా ప్రాసెస్ అవుతాయి. అంటే మనుషుల జోక్యం లేకుండా, పారదర్శకంగా త్వరగా డబ్బు మీ ఖాతాలో జమ అవుతుంది.


ఈ ఏడాది రికార్డ్ స్థాయిలో క్లెయిమ్‌లు

2024-25 ఆర్థిక సంవత్సరంలో EPFO ఏకంగా 2.34 కోట్ల అడ్వాన్స్ క్లెయిమ్‌లను ఆటో సెటిల్ చేసింది. ఇది గత ఏడాదితో పోలిస్తే 161% ఎక్కువ. ఈ సంవత్సరం మొదటి రెండున్నర నెలల్లోనే 76.52 లక్షల క్లెయిమ్‌లు సెటిల్ అయ్యాయి, అంటే దాదాపు 70% క్లెయిమ్‌లు ఆటో మోడ్‌లో పూర్తయ్యాయి. ఇప్పుడు రూ.5 లక్షల పరిమితితో, మరిన్ని క్లెయిమ్‌లు ఈ సౌకర్యం కిందకు వస్తాయి. దీనివల్ల మీ క్లెయిమ్ మూడు రోజుల్లోనే ప్రాసెస్ అవుతుంది.


మీరు ఏం చేయాలి?

  • EPFO అధికారిక వెబ్‌సైట్ (epfindia.gov.in) లేదా UMANG యాప్ ద్వారా మీ క్లెయిమ్‌లను సమర్పించండి.

  • మీ PF ఖాతా వివరాలను ఎవరితోనూ పంచుకోవద్దు

  • మీ UAN, బ్యాంక్ ఖాతా, ఆధార్ వివరాలు సరిగ్గా లింక్ అయి ఉన్నాయని నిర్ధారించుకోండి

  • EPFO సోషల్ మీడియా లేదా వెబ్‌సైట్‌లో తాజా అప్‌డేట్‌లను తెలుసుకోండి


ఇవి కూడా చదవండి

అర్జెంటుగా డబ్బు అవసరం.. పర్సనల్ లోన్ తీసుకోవాలా? గోల్డ్ బెటరా?

మీ లోన్ ఇంకా మంజూరు కాలేదా..ఇవి పాటించండి, వెంటనే అప్రూవల్

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 19 , 2025 | 04:49 PM