Share News

Raghurama Clarity on West Godavari Collectorate: పశ్చిమగోదావరి కలెక్టరేట్ నిర్మాణంపై రఘురామ క్లారిటీ

ABN , Publish Date - Aug 26 , 2025 | 01:09 PM

నూతన పశ్చిమగోదావరి జిల్లా ఏర్పడ్డాక కలెక్టరేట్ ఆఫీస్ అద్దె భవనంలో కొనసాగుతుందని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు తెలిపారు. మార్కెట్ యార్డులో కలెక్టరేట్‌‌కు స్థలం ఇచ్చారని.. అది ముందుకు వెళ్లలేదని రఘురామ క్లారిటీ ఇచ్చారు.

Raghurama Clarity on West Godavari Collectorate: పశ్చిమగోదావరి కలెక్టరేట్ నిర్మాణంపై రఘురామ క్లారిటీ
Raghurama Clarity on West Godavari Collectorate

పశ్చిమగోదావరి, ఆగస్టు26 (ఆంధ్రజ్యోతి): భీమవరం వేరు, ఉండి వేరుగా తాను చూడటం లేదని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు (Raghurama Krishnam Raju) స్పష్టం చేశారు. కొంత మంది సంకుచిత స్వభావంతో మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు. ఇవాళ(మంగళవారం) పశ్చిమగోదావరి జిల్లాలో రఘురామ పర్యటించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టరేట్ నిర్మాణంపై రఘురామకృష్ణరాజు మాట్లాడారు.


నూతన పశ్చిమగోదావరి జిల్లా ఏర్పడ్డాక కలెక్టరేట్ ఆఫీస్ అద్దె భవనంలో కొనసాగుతోందని తెలిపారు. మార్కెట్ యార్డులో కలెక్టరేట్‌‌కు స్థలం ఇచ్చారని.. అది ముందుకు వెళ్లలేదని క్లారిటీ ఇచ్చారు. రూ.100 కోట్లు పెట్టి స్థలాన్ని ప్రభుత్వం కొన్నదని.. ఇప్పుడు కలెక్టరేట్ కట్టడం కష్టమని చెప్పుకొచ్చారు. పెద అమిరం గ్రామాన్ని భీమవరం మున్సిపాలిటీలో కలపడానికి సిద్దంగా ఉన్నామని తెలిపారు రఘురామకృష్ణరాజు.


కలెక్టర్ ఆఫీసుకు రూ.70 కోట్లు అయితే.. రూ.35 కోట్లు ప్రభుత్వం, మరో రూ.35 కోట్లు ‌తాము సమకూర్చామని రెండు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో కలెక్టర్ ఆఫీసు నిర్మించాలని అనుకుంటున్నామని వెల్లడించారు. మండలి చైర్మన్ ఇరిగేషన్ భూమి అని అన్నారని.. తాను సంకుచిత భావం లేకుండా జిల్లా అంతా ఒక యూనిట్‌గా భావిస్తున్నామని చెప్పుకొచ్చారు. త్వరలో శంకుస్థాపనకు రావాలని సీఎం చంద్రబాబు నాయుడును కోరానని గుర్తుచేశారు. కలెక్టరేట్‌కు తాను స్థలాన్ని సమకూర్చానని.. సగం ధనాన్ని ఇస్తానని తాను మాట ఇచ్చానని రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

జగన్‌కు హైకోర్టులో ఎదురు దెబ్బ

ఎకో ఫ్రెండ్లీ గణేష్ తయారీలో.. ఎన్టీఆర్ జిల్లా వరల్డ్ రికార్డ్‌

For More AP News And Telugu News

Updated Date - Aug 26 , 2025 | 01:15 PM