Minister Nimmla Ramanaidu: జగన్ కోట్ల రూపాయలు దోచుకున్నారు..
ABN , Publish Date - Oct 08 , 2025 | 06:24 PM
గత వైసీపీ ప్రభుత్వంలో మున్సిపాలిటీల నిధులను సైతం దారి మళ్లించారని మంత్రి రామానాయుడు ఆరోపించారు. పట్టణాలను నిర్వీర్యం చేశారని మండిపడ్డారు.
పశ్చిమ గోదావరి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధిలో దూసుకెళ్తోందని జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పాలకొల్లు మున్సిపాలిటీలో నిర్వహిస్తున్న అభివృద్ధి పనులను ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నిమ్మల మాట్లాడుతూ.. మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో నిర్మించిన టిడ్కో ఇళ్లను బ్యాంకులో జగన్ తాకట్టు పెట్టారని ఆరోపించారు. లబ్ధిదారుల నెత్తిన జగన్ అప్పుల భారం మోపారని విమర్శించారు. టిడ్కో గృహాలలో మిగిలిన పనులు పూర్తి చేసి త్వరలో లబ్ధిదారులకు అందజేస్తామని ఆయన వెల్లడించారు.
వైసీపీ గత ప్రభుత్వంలో మున్సిపాలిటీల నిధులను సైతం దారి మళ్లించారని మంత్రి రామానాయుడు ఆరోపించారు. పట్టణాలను నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. జగన్ ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చి.. కల్తీ లిక్కర్, ఇసుక, గనులు, విలువైన భూముల ద్వారా కోట్లాది రూపాయలు దోచుకున్నారని ఆరోపించారు. రాష్ట్రాన్ని అన్ని విధాలా జగన్ సర్వనాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునేందుకే వైసీపీ కుట్ర రాజకీయాలు చేస్తోందని మంత్రి రామానాయుడు ధ్వజమెత్తారు.
Also Read:
కెమిస్ట్రీలో ముగ్గురికి నోబెల్ ఫ్రైజ్..
మాజీ సీఎం జగన్‌పై కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఫైర్..
అభ్యర్థుల ఖరారుకు బీజేపీ కీలస సమావేశం