SP Amit Bardar: అల్లూరి జిల్లాలో మావోల ఎన్‌కౌంటర్.. కీలక విషయాలు వెల్లడించిన ఎస్పీ అమిత్ బర్దార్
ABN , Publish Date - Jun 19 , 2025 | 09:20 PM
మావోయిస్ట్ కీలక నేతలు గాజుల రవి అలియాస్ ఉదయ్, వెంకట రవి చైతన్య అలియాస్ అరుణ, అంజు అలియాస్ మాసే.. ఈ ముగ్గురు పోలీస్ కాల్పుల్లో మృతి చెందారు. ఈ ఘటనపై అల్లూరి జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ వివరాలు వెల్లడించారు.
అల్లూరి జిల్లా: మావోయిస్ట్ కీలక నేతలు (Maoist Leaders) గాజుల రవి అలియాస్ ఉదయ్, వెంకట రవి చైతన్య అలియాస్ అరుణ, అంజు అలియాస్ మాసే.. ఈ ముగ్గురు పోలీస్ కాల్పుల్లో నిన్న(బుధవారం) మృతి చెందారు. ఈ ఘటనపై అల్లూరి జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ (SP Amit Bardar) వివరాలు వెల్లడించారు. విశాఖపట్నంలోని కైలాసగిరి రూరల్ పోలీస్ కార్యాలయంలో ఇవాళ(గురువారం) అల్లూరి జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ మాట్లాడారు. విశ్వసనీయ సమాచారంతో కింటుకూర అటవీ ప్రాంతంలో ఆపరేషన్ నిర్వహించామని తెలిపారు. ఆ సమయంలో పోలీసుల భద్రతా బలగాల మీద మావోయిస్టులు కాల్పులు జరిపారని చెప్పారు ఎస్పీ అమిత్ బర్దార్.
తమ ఆత్మరక్షణ కోసం ఎదురుకాల్పులు జరిపామని అల్లూరి జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ అన్నారు. మావోయిస్టు నేతలు గాజుల రవి అలియాస్ ఉదయ్, వెంకట రవి చైతన్య అలియాస్ అరుణ, అంజు అలియాస్ మాసే.. ఈ ముగ్గురు పోలీస్ కాల్పుల్లో మృతి చెందారని తెలిపారు. గాజుల రవి మీద సుమారు 150 కేసులున్నాయని.. రూ. 25 లక్షల రివార్డు ఉందని వెల్లడించారు. అరుణ మీద కూడా 150 కేసులు ఉన్నాయని.. రూ. 20 లక్షల రివార్డు ఉందని, అంజు మీద 22 కేసులు ఉన్నాయి, లక్ష రూపాయలు రివార్డు ఉందని తెలిపారు. ఈ సంఘటన ప్రాంతంలో మూడు ఏకే 47 తుపాకులు, కిట్ బ్యాగులు, తూటాలు మావో సాహిత్యం స్వాధీనం చేసుకున్నామని వివరించారు అల్లూరి జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్.
ఈ ముగ్గురు మావోయిస్టులు కూడా కొద్దీ రోజుల క్రితం వై రామవరం పోలీస్ స్టేషన్ పరిధిలో ఎదురుకాల్పుల నుంచి తప్పించుకున్నారని అల్లూరి జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ అన్నారు. అరకు శాసనసభ్యులు సర్వేశ్వరరావు, మాజీ శాసనసభ్యులు సోమ హత్య కేసు, అన్నవరం పోలీస్ స్టేషన్ పరిధిలో పేలుళ్లు, బలిమెల ఘటనలో కూడా ఈ మావోల పాత్ర ఉందని గుర్తుచేశారు. ఈ సంఘటన మీద 65/ 225 కేసు నమోదు చేశామని చెప్పారు. ఇది పూర్తిగా ఆంధ్రప్రదేశ్ పరిధిలో ఆన్ డ్యూటీ ప్రక్రియ అని వివరించారు. ఏపీ భూభాగంలో ఈ ఘటన జరిగిందని అన్నారు. మావోలు శాంతిభద్రతల దృష్ట్యా జన జీవన స్రవంతిలో కలిసిపోవాలని సూచించారు. సాధారణంగా మావోల విషయంలో వారు లొంగిపోవాలని ముందుగా తాము కోరుతామని చెప్పారు. గతంలో కంటే ప్రస్తుతం మావోల సంఖ్య గణనీయంగా తగ్గిందని అల్లూరి జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ వెల్లడించారు.
ఈ వార్తలు కూడా చదవండి
నెల్లూరు రైల్వే కోర్టుకు మాజీ మంత్రి
జగన్ వ్యాఖ్యలపై నవ్వుకుంటున్నారు.. పట్టాభి సెటైర్
జగన్ పల్నాడు పర్యటనపై షర్మిల సంచలన కామెంట్స్
Read latest AP News And Telugu News