Minister Kondapalli Srinivas: ఎంఎస్ఎంఈలకు అండగా ఉంటాం
ABN , Publish Date - Nov 18 , 2025 | 08:42 AM
ఢిల్లీలో ఏపీ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎంఎస్ఎంఈలకు సంబంధించి కేంద్రమంత్రి జితిన్ రామ్ మాంజీతో చర్చించారు. ఏపీలో చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని కోరారు మంత్రి కొండపల్లి.
ఢిల్లీ, నవంబరు18(ఆంధ్రజ్యోతి): ఎంఎస్ఎంఈలకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని ఏపీ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ (Minister Kondapalli Srinivas) భరోసా కల్పించారు. ఇవాళ(మంగళవారం) ఢిల్లీలో మంత్రి కొండపల్లి పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎంఎస్ఎంఈలపై మంత్రి కొండపల్లి దృష్టి సారించారు. ఢిల్లీలోని ప్రగతి మైదాన్ భారత్ మండపంలో జరుగుతున్న అంతర్జాతీయ ఎంఎస్ఎంఈ ఎగ్జిబిషన్‌ను మంత్రి సందర్శించారు. ఈ క్రమంలో ఎగ్జిబిషన్ సందర్శనకు కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి జితిన్ రామ్ మాంజీ వచ్చారు.
భారత్ మండపం హాల్ నెంబర్ ఐదులో జితిన్ రామ్ మాంజీని మర్యాద పూర్వకంగా కలిశారు మంత్రి కొండపల్లి. జితిన్ రామ్ మాంజీతో ఎంఎస్ఎంఈలపై చర్చించారు మంత్రి కొండపల్లి. ఏపీలో చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని కోరారు. ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటును కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు మంత్రి కొండపల్లి.
పెద్దఎత్తున చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటు దిశగా ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు కొండపల్లి. అలాగే, హాల్ నెంబర్ - 4లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన స్టాల్ యజమానులతో మాట్లాడి.. కీలక సూచనలు చేశారు. ఈ ఎగ్జిబిషన్లో వ్యాపారం జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు మంత్రి. ఇతర రాష్ట్రాలకు చెందిన స్టాల్స్‌ను కూడా సందర్శించారు. ఏపీలో కూడా పరిశ్రమల ఏర్పాటుకు పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని కోరారు. ఈ మేరకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఓ ప్రకటన విడుదల చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. 11మందికి గాయాలు..
ర్యాగింగ్ కలకలం... పొట్టు పొట్టు కొట్టుకున్న విద్యార్థులు
Read Latest AP News And Telugu News