AP Governament: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. స్వచ్ఛాంధ్ర ఆవార్డుల ప్రధానం
ABN , Publish Date - Sep 01 , 2025 | 04:04 PM
ఏపీలో చేపట్టిన స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా.. పారిశుధ్యంపై శాఖల వారీగా తీసుకన్న రిపోర్టులు ఆధారంగా అవార్డులకు ఎంపిక ఉటుందని ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర, జిల్లా స్థాయిలో పనిచేసిన వారిని గుర్తించి వారికి అవార్డులు ఇవ్వాలని నిర్ణయించినట్లు పేర్కొంది.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోంది. దానికి కావలసిన కార్యాచరణ సిద్ధం చేసుకుని ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ.. సీఎం చంద్రబాబు నాయకత్వంలో అంతఃకరణ శుద్ధితో పనులు చేస్తూ.. లక్ష్య సాధన దిశగా పరుగులు పెడుతుంది. ఈ మేరకు ఇప్పటికే పలు కార్యక్రమాలను ప్రారంభించిన ప్రభుత్వం.. తాజాగా మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. ఈసారి నాయకులతో పాటు ప్రజల్లో చైతన్యం పెంచేందుకు సిద్ధం అయ్యింది. స్వచ్ఛాంధ్ర పేరుతో ఇప్పటికే.. నగరాలు, పట్టణాలు, గ్రామాలను శుభ్రంగా మార్చే.. పనిలే ప్రభుత్వం నిమగ్నం అయినా సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు స్వచ్చాంధ్ర కార్యక్రమంలో భాగంగా.. రాష్ట్ర, జిల్లా స్ధాయిలో స్వచ్చాంధ్ర ఆవార్డులు ప్రధానం చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
అయితే ఇప్పటికే.. స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా పారిశుధ్యంపై శాఖల వారీగా తీసుకన్న రిపోర్టులు ఆధారంగా అవార్డుల ఎంపిక ఉటుందని ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర, జిల్లా స్థాయిలో పనిచేసిన వారిని గుర్తించి వారికి అవార్డులు ఇవ్వాలని నిర్ణయించినట్లు పేర్కొంది. 13 కేటగిరిలలో అవార్డులు ఇవ్వనున్నట్లు చెప్పుకొచ్చింది. ఎన్జీవోలు, స్వచ్ఛ రెసిడెన్సియల్ స్కూళ్లును గుర్తించి జిల్లా కలెక్టర్ నామినేషన్ మీద అవార్డులు అందజేస్తారని చెప్పింది. రాష్ట్ర స్ధాయిలో 52 అవార్డులు, జిల్లా స్ధాయిలో 1421 అవార్డులు అందించాలని భావిస్తున్నట్లు వివరించింది. స్వచ్చ ఆంధ్ర అవార్డులను అక్టోబర్ 2న నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. అవార్డుల ప్రధానానికి, ఎంపికకు నోడల్ ఏజెన్సిగా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఉంటుందని వెల్లడించారు.
ఇవి కూడా చదవండి:
భారత యుద్ధ నౌకలన్నీ స్వదేశంలోనే తయారవుతాయి: రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్
సెప్టెంబర్ నెలాఖరు కల్లా ఎయిర్ ఫోర్స్ చేతికి రెండు తేజస్ ఎమ్‌కే-1ఏ ఫైటర్ జెట్స్