Students: విద్యార్థులకు అస్వస్థత.. ఆసుపత్రికి తరలింపు
ABN , Publish Date - Feb 03 , 2025 | 08:42 PM
Students: గోపాలపట్నంలోని ప్రభుత్వ పాఠశాల్లో విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు.

విశాఖపట్నం, ఫిబ్రవరి 03: స్థానిక గోపాలపట్నం వెంకటాపురం బీసీ కాలనీలోని జిల్లా పరిషత్ పాఠశాల్లో పలువురు విద్యార్థులు సోమవారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తరగతి గదుల్లో తీవ్ర దుర్వాసన వచ్చింది. దీంతో13 మంది విద్యార్థులకు వాంతులయ్యాయి. అనంతరం వారు కళ్లు తిరిగి కింద పడిపోయారు. పాఠశాలలోని ఉపాధ్యాయులు, సిబ్బంది వెంటనే స్పందించి.. సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే ప్రస్తుతం విద్యార్థుల పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు.
బాధితులంతా 8, 9 తరగతుల విద్యార్థులని పాఠశాల సిబ్బంది వెల్లడించారు. విద్యార్థులకు తీవ్ర అస్వస్థతపై జిల్లా ఉన్నతాధికారులు సైతం స్పందించారు. ఈ ఘటనపై వారు ఆరా తీశారు. విద్యార్థులకు మెరుగైన చికిత్స అందించాలని ప్రభుత్వ వైద్యులను ఆదేశించారు. అలాగే పాఠశాలలోని తరగతి గదుల్లో అపరిశుభ్రతపై ప్రధాన ఉపాధ్యాయుడితోపాటు సిబ్బందిపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాల తరగతి గదులతోపాటు పరిసర ప్రాంతాలను శుభ్రం చేయాలని ఆదేశించారు.
ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలంటూ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడిని ఆదేశించారు. ఇంకోవైపు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురవుతున్న సంఘటనలు తరచూ చోటు చేసుకొంటున్నాయి.
ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై ప్రభుత్వం సైతం సీరియస్ అవుతుంది. ఇప్పటికే విద్యా శాఖ మంత్రి నారా లోకేష్.. ఈ తరహా ఘటనలపై ఆయన ఆరా తీస్తున్నారు. ఈ తరహా ఘటనలు చోటు చేసుకుంటే.. వెంటనే జిల్లా అధికారులు అప్రమత్తం కావాలని ఆయన ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన విషయం విధితమే.
మరిన్ని తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: వాల్తేర్ డివిజన్‌లో అధికంగా రైళ్లు కేటాయింపు
Also Read: మేజిస్ట్రేట్ ముందు తిట్టుకొన్న మోహన్ బాబు, మనోజ్
Also Read: హెల్మెట్‌కి సెల్యూట్.. ప్రాణాలు కాపాడడం అదుర్స్
Also Read: అక్కడ మతం మారారా.. జైలు శిక్షతోపాటు భారీ జరిమానా
Also Read: ఏపీకి మరో గుడ్ న్యూస్: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
Also Read: ముగిసిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వం
For AndhraPradesh News And Telugu News