Share News

Manoj Kumar Sahu: వాల్తేర్ డివిజన్‌లో అధికంగా రైళ్లు కేటాయింపు

ABN , Publish Date - Feb 03 , 2025 | 08:11 PM

ఆంధ్రప్రదేశ్‌కు 200 వందే భరత్, 100 నవ భారత్ రైళ్లను దశలు వారిగా కేటాయింపునకు కేంద్రం అంగీకారం తెలిపిందని వాల్తేర్ డిఆర్ఎమ్‌వో మనోజ్ కుమార్ సాహో వెల్లడించారు. అమృత భారత్ స్టేషన్‌ల అభివృద్ధికి రూ. 800 కోట్లు కేటాయించిందని చెప్పారు.

Manoj Kumar Sahu: వాల్తేర్ డివిజన్‌లో అధికంగా రైళ్లు కేటాయింపు

విశాఖపట్నం, ఫిబ్రవరి 03: వాల్తేర్ డివిజన్‌లో అధికంగా రైళ్లు కేటాయింపునకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని డిఆర్ఎమ్‌వో మనోజ్ కుమార్ సాహో స్పష్టం చేశారు. సోమవారం విశాఖపట్నంలోని డివిజన్ కార్యాలయంలో రైల్వే అధికారులు బడ్జెట్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి కేటాయింపులపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బడ్జెట్‌లో ఏపీలో రైల్వే కోసం రూ. 9147 కోట్లు కేటాయించారని వివరించారు.

అలాగే రాష్ట్రానికి 200 వందే భరత్, 100 నవ భారత్ రైళ్లను దశలు వారిగా కేటాయింపునకు కేంద్రం అంగీకారం తెలిపిందన్నారు. అమృత భారత్ స్టేషన్‌ల అభివృద్ధికి రూ. 800 కోట్లు కేటాయించిందని చెప్పారు. దువ్వాడ, సింహాచలం, కొత్తవలస, నౌపడ, ఆరుకు, చీపురుపల్లి, విజయనగరం, బొబ్బిలి, పార్వతీపురం, జైపూర్‌ తదితర స్టేషన్లు అమృత్ భారత్ స్టేషన్ల.. విశాఖ జోన్‌లో ఉండటం సంతోషంగా ఉందన్నారు.

అమృత్ భారత్ రైల్‌లో ప్రయాణం తక్కువ ధరలో ఇచ్చేందుకు రూపకల్పన చేసినట్లు తెలిపారు. 1000 కిలో మీటర్ల రైలు ప్రయాణానికి రూ. 450గా టికెట్ ధరను నిర్ణయించినట్లు తెలిపారు. ప్రస్తుతం విశాఖపట్నం నుంచి నాలుగు వందే భరత్ ట్రైయిన్లు నడుపుతున్నామని పేర్కొన్నారు. 300 కిలోమీటర్లు ఆధునీకరణతో రైల్వే ట్రాక్ నూతనంగా నిర్మిస్తున్నామన్నారు. కేంద్రం ప్రకటించిన బడ్జెట్‌తో వాల్తేర్ రైల్వే డివిజన్ అభివృద్ధి చెందుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రూ.500 కోట్లతో విశాఖపట్నం స్టేషన్ ఆధునీకరణకు కేటాయించారని వివరించారు.


మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో రైల్వేల కోసం బడ్జెట్‌లో కేటాయింపులపై ఆ శాఖ కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ సోమవారం న్యూఢిల్లీలో వివరించారు. ఆంధ్రప్రదేశ్‌లో రైల్వే అభివృద్ధి కేటాయించిన నిధులను వివరించారు. ఇది యూపీఏ హయాంలో కంటే 11 రెట్లు అధికమన్నారు. అలాగే రాష్ట్రంలో రూ.84,559 కోట్ల ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయని చెప్పారు.

Also Read: మేజిస్ట్రేట్ ముందు తిట్టుకొన్న మోహన్ బాబు, మనోజ్


అందులోభాగంగా 73 రైల్వేస్టేషన్లు అభివృద్ధి చేశామని.. నూటికి నూరు శాతం రైల్వే లైన్లు విద్యుదీకరణ పూర్తయిందని తెలిపారు. అదే విధంగా1,560 కిలోమీటర్ల మేర రైల్వే ట్రాక్ నిర్మించామని వెల్లడించారు. రాష్ట్రంలో రైల్వే అభివృద్ధికి సీఎం చంద్రబాబు నాయుడు సహకరిస్తున్నారని.. ఈ నేపథ్యంలో ఆయనకు ధన్యవాదాలు సైతం తెలిపారు.

Also Read: హెల్మెట్‌కి సెల్యూట్.. ప్రాణాలు కాపాడడం అదుర్స్


16 జిల్లాలను కలుపుతూ ఏపీలో 8 వందే భారత్ రైళ్లు సేవలందిస్తున్నాయన్నారు. భవిష్యత్‌లో ఆంధ్రప్రదేశ్‌కు మరిన్ని వందే భారత్ రైళ్లు వస్తాయని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. అలాగే దేశవ్యాప్తంగా 110 కిలోమీటర్ల వేగంతో వెళ్లేందుకు రైల్వే ట్రాక్స్‌ను సిద్ధం చేస్తున్నామన్నారు. కొన్ని రూట్లలో 130 కిలోమీటర్ల వేగంతో.. మరికొన్ని రూట్లలో 160 కిలోమీటర్ల వేగంతో రైళ్లు ప్రయాణించేందుకు ట్రాక్స్ సిద్దం చేస్తున్నామని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వివరించారు.

మరిన్ని తెలుగు వార్తలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read: అక్కడ మతం మారారా.. జైలు శిక్షతోపాటు భారీ జరిమానా

Also Read: ఏపీకి మరో గుడ్ న్యూస్: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్

Also Read: ముగిసిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వం

For AndhraPradesh News And Telugu News

Updated Date - Feb 03 , 2025 | 08:11 PM