AP Assembly sessions: ఫీజు రీయింబర్స్మెంట్‌పై వైసీపీకి లోకేశ్ సవాల్..
ABN , Publish Date - Sep 23 , 2025 | 10:49 AM
గత వైసీపీ ప్రభుత్వం రూ. 4 వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పెండింగ్ పెట్టిందని మంత్రి లోకేశ్ ఆరోపించారు. ఇప్పుడు బకాయిలపై వాయిదా తీర్మానం అడగటం విడ్డూరంగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై శాసనమండలిలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. మండలి ఛైర్మన్ తిరస్కరించిన వాయిదా తీర్మానానికి మంత్రి నారా లోకేశ్ సమాధానం ఇచ్చారు. శాసన మండలిలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై వైసీపీ వాయిదా తీర్మానం ఇచ్చింది. తీర్మానాన్ని మండలి ఛైర్మన్ తిరస్కరించారు. అయినా చర్చ జరగాలని వైసీపీ పట్టుబట్టింది. దీంతో సమాధానం ఇచ్చేందుకు తాము సిద్ధమని లోకేశ్ సవాల్ విసిరారు.
ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ.. గత వైసీపీ ప్రభుత్వం రూ. 4 వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పెండింగ్ పెట్టిందని మంత్రి నారా లోకేశ్ ఆరోపించారు. ఇప్పుడు బకాయిలపై వాయిదా తీర్మానం అడగటం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. గతంలో బొత్స సత్యనారాయణ విద్యాశాఖ మంత్రిగా ఉండి.. రూ. 4 వేల కోట్ల బకాయిలు పెండింగ్‌లో పెట్టారని విమర్శించారు. చర్చలు కొనసాగుతున్నప్పుడు మధ్యలో ఛైర్మన్ కలగచేసుకున్నారు. తిరస్కరించిన వాయిదా తీర్మానంపై సభ్యుల వాదులాట సరికాదని ఛైర్మన్ విస్మయం చెందారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆ మార్పులతో ముందుగానే దసరా: బీజేపీ
ఎన్టీటీపీఎస్ కాలుష్యంపై మంత్రి గొట్టిపాటి కీలక వ్యాఖ్యలు