Minister Nara Lokesh: మొంథా తుఫాన్.. లోకేశ్ కీలక ఆదేశాలు..
ABN , Publish Date - Oct 28 , 2025 | 12:00 PM
వివిధ జిల్లాల్లో కురిసిన వర్షపాతంపై అధికారులను మంత్రి లోకేశ్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. ఎప్పటికప్పుడు అధికారులు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగుతున్న మొంథా తుఫాన్ తీవ్రతపై విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ సమీక్ష నిర్వహించారు. సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రంలో హోంమంత్రి వంగలపూడి అనిత, ఇతర ఉన్నతాధికారులతో ఆయన భేటీ అయ్యారు. పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేయాలని అధికారులను ఆదేశించారు. ఏ ప్రాంతంలో మొంథా తుఫాన్ తీరం దాటుతోంది.. అనే అంశాలను లోకేశ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. మొంథా తుఫాన్ ప్రభావంతో ఇప్పటికే పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయని లోకేశ్‌కు అధికారులు వివరించారు.
ఈ నేపథ్యంలో నిన్నటి నుంచి వివిధ జిల్లాల్లో కురిసిన వర్షపాతంపై అధికారులను మంత్రి లోకేశ్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. ఎప్పటికప్పుడు అధికారులు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. తుఫాన్ నేపథ్యంలో.. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. ఏదైనా సమస్య తలెత్తితే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని స్పష్టం చేశారు. ప్రజల భద్రత దృష్ట్యా తుఫాన్ ప్రభావిత ప్రాంతాలలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు లోకేశ్ వెల్లడించారు.
మొంథా తుఫాన్ ప్రభావంతో.. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా రహదారులు జలమయం అయ్యాయి. పలు కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. కాలువలు, వాగులు పొంగిపొర్లుతుండటంతో.. పలు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షాల కారణంగా.. విద్యుత్తు సరఫరాకు పలు ప్రాంతాల్లో అంతరాయం ఏర్పడింది. వర్షాలకు భారీ వృక్షాలు, కరెంట్ స్తంభాలు నేలకొరిగాయి. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఆదేశాల మేరకు అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు ప్రజలను పర్యవేక్షిస్తుంది.
ఇవి కూడా చదవండి..
Election Commission Announced: తమిళనాడు, బెంగాల్‌లో ఎస్‌ఐఆర్
Money View App: 3 గంటల్లో 49 కోట్లు కొట్టేశారు..!