Nara Lokesh: మాకు పని భద్రత కల్పించాలి.. నారా లోకేష్‌కు ఆశా వర్కర్ల విన్నపం
ABN , Publish Date - Feb 15 , 2025 | 11:27 AM
Nara Lokesh: మంత్రి నారా లోకేష్‌ను ఆశావర్కర్లు ఇవాళ కలిశారు. ఈ సందర్భంగా ఆశావర్కర్లతో కాసేపు మాట్లాడారు. వారి సమస్యలపై నారా లోకేష్ చర్చించారు. వారి సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

విశాఖపట్నం: మంత్రి నారా లోకేష్‌ను ఆశావర్కర్లు ఇవాళ(శనివారం) విశాఖపట్నంలో కలిశారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ మేరకు తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఆశా వర్కర్లు నారా లోకేష్‌కు వినతి పత్రం అందజేశారు. తమ సమస్యలను నారా లోకేష్ పరిష్కరిస్తారనే నమ్మకం ఉందని తెలిపారు. తమను విధుల నుంచి తొలగించకుండా కొనసాగిస్తామని నారా లోకేష్ హామీ ఇచ్చారని తెలిపారు..ఈ సందర్భంగా ఆశా వర్కర్లు మీడియాతో మాట్లాడారు. టీడీపీ కార్పొరేటర్లు తమను విధుల నుంచి తొలగించాలని కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారని చెప్పారు. గత జగన్ ప్రభుత్వంలో వైసీపీ కండువా వేసుకుని ఆశావర్కర్లు ఆ పార్టీ సమావేశంలో పాల్గొన్నారు.
అప్పటి పీడీ బాపూనాయడు ఒత్తిడితోనే తాము వైసీపీ సమావేశంలో పాల్గొన్నామని చెప్పారు. పీడీ బాపూనాయడు మొత్తం యుసీడీని వైసీపీ పార్టీ యంత్రంగా మార్చారని ఆరోపించారు. తమను రాజకీయాల్లోకి లాగొద్దని.. తమను ప్రభుత్వ ఉద్యోగులుగా కొనసాగించాలని, 3 సంవత్సరాల కాలపరిమితి సర్క్యూలర్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మెప్మా, ఆర్పీల వ్యక్తిగత అకౌంట్లోకి వేతనం జమ అయ్యే విధంగా ఆదేశాలు ఇవ్వాలని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అలాగే జీవీఎంసీ పరిధిలో ఆర్పీలుగా తాము విధులు నిర్వహిస్తున్నామని తెలిపారు. తాము ప్రభుత్వ పథకాలను ప్రజల వద్దకు తీసుకువెళ్తున్నామని అన్నారు.
పేద మహిళలకు డ్వాక్రా గ్రూపులు పెట్టి, బ్యాంకు లోన్లు ఇప్పించడమే కాకుండా ప్రభుత్వం చేపట్టే ప్రభుత్వ పథకాలకు ప్రచారం, ప్రభుత్వ సమావేశాలకు మహిళలను సమీకరించడం వంటి చాలా పనులు చేస్తున్నామని చెప్పుకొచ్చారు. తమకు ఇ చ్చే జీతాలను తమ వ్యక్తిగత ఖాతాల్లో వేయాలని ఎన్నికల సమయంలో చంద్రబాబుకు తెలిపామని గుర్తుచేశారు. ఆశావర్కర్లకు అన్యాయం జరగకుండా చర్యలు తీసుకుంటామని చంద్రబాబు హామీ ఇచ్చారని గుర్తుచేశారు. ఆ హామీని అమలు చేయాలని కోరారు. అలాగే 3సంవత్సరాల కాలపరిమితి సర్క్యులర్ రద్దు చేయాలని, తమ మీద పని ఒత్తిడిని తగ్గించాలని, పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని విజ్ఞప్తి చేశారు. తమపై రాజకీయ వేధింపులు లేకుండా చూడాలని, పని భద్రత కల్పించాలని ఆశావర్కర్లు కోరారు.
ఈ వార్తలు కూడా చదవండి
CM Chandrababu : నేరుగా అర్జీదారుల వద్దకే!
Transgender Welfare: రాష్ట్ర ట్రాన్స్‌జెండర్ల సంక్షేమ బోర్డు ఏర్పాటు
Nimmala Ramanaidu : ఆ ట్వీట్ జగన్ నేర స్వభావాన్ని చాటుతోంది
Read Latest AP News and Telugu News