Share News

Lokesh Nepal Rescue: నేపాల్ నుంచి ఏపీకి చేరుకున్న స్పెషల్ ఫ్లైట్..

ABN , Publish Date - Sep 11 , 2025 | 04:54 PM

సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ చొరవ తీసుకుని ఫ్లైట్ ఏర్పాటు చేశారని ఎయిర్ హోస్టెస్ తెలిపారు. దీంతో భారీ ఎత్తున ప్రయాణికులు హర్షధ్వానాలు చేశారు.

Lokesh Nepal Rescue: నేపాల్ నుంచి ఏపీకి చేరుకున్న స్పెషల్ ఫ్లైట్..
Minister Nara Lokesh

అమరావతి: నేపాల్‌లో కొనసాగుతున్న ఉద్రిక్తతల వేళ.. అక్కడ చిక్కుకున్న తెలుగు వారిని క్షేమంగా తీసుకురావడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోంది. ఈ నేపథ్యంలో మంత్రి నారా లోకేశ్ నిరంతర కృషితో బాధితులు ఏపీకి చేరుకున్నారు. కాఠ్మండూ నుంచి ఏపీ స్పెషల్ ఎయిర్ క్రాఫ్ట్‌లో వారులో ల్యాండ్ అయ్యారు. సొంత రాష్ట్రానికి వచ్చిన ఆనందంలో ప్రయాణికులు హర్షధ్వానాలు చేశారు.


సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ చొరవ తీసుకుని ఈ ఫ్లైట్ ఏర్పాటు చేశారని వారు తెలిపారు. తమపై సురక్షితంగా తీసుకొచ్చినందుకు.. సీఎం చంద్రబాబు, నారా లోకేశ్‌కు వారు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం జై చంద్రబాబు, జై నారా లోకేశ్ అంటూ నినాదాలు చేశారు.


నేపాల్‌లో కొనసాగుతున్న అశాంతి మధ్య చిక్కుకున్న తెలుగు పౌరులను తిరిగి తీసుకురావడానికి మంత్రి నారా లోకేశ్ ప్రత్యక్ష బాధ్యత తీసుకున్న విషయం తెలిసిందే. బాధితులు.. వారి కుటుంబాల సమాచారం, సహాయం పొందడానికి ఏపీ ప్రభుత్వం హెల్ప్‌లైన్ కూడా ప్రారంభించారు. ఢిల్లీలోని ఏపీ భవన్, విదేశాంగ మంత్రిత్వ శాఖ, పౌర విమానయాన అధికారుల సమన్వయంతో వారిని తిరిగి రప్పించేందుకు ప్రయత్నాలు చేశారు. అక్కడ చిక్కుకున్న పౌరులతో నేరుగా మాట్లాడి.. వారికి రక్షణ, భద్రతకు హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు ఏపీ పౌరులను నారా లోకేశ్ ప్రత్యేక విమానంలో సురక్షితంగా ఏపీకి తీసుకొచ్చారు.


ఈ వార్తలు కూడా చదవండి

సూపర్ సిక్స్.. సూపర్ హిట్ సభతో జగన్‌కు దిమ్మతిరిగింది: మంత్రి గొట్టిపాటి

భవిష్యత్తులో సుపరిపాలన అందిస్తూ పెట్టుబడులు తీసుకొస్తాం: పల్లా శ్రీనివాసరావు

Updated Date - Sep 11 , 2025 | 06:53 PM