CM Chandrababu on Araku Coffee: జీసీసీ- టాటా ఒప్పందంతో అరకు కాఫీకి నూతన అవకాశాలు: సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Oct 03 , 2025 | 09:08 PM
జీఐ ట్యాగ్ పొందిన తర్వాత అరకు కాఫీ అంతర్జాతీయ స్థాయిలో ప్రముఖ బ్రాండ్‌గా మారిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. అరకు కాఫీకి ఛేంజ్ మేకర్ అవార్డుపై సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు.
అమరావతి, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి): జీఐ ట్యాగ్ పొందిన తర్వాత అరకు కాఫీ (Araku Coffee) అంతర్జాతీయ స్థాయిలో ప్రముఖ బ్రాండ్‌గా మారిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) వ్యాఖ్యానించారు. అరకు కాఫీకి ఛేంజ్ మేకర్ అవార్డు రావడంపై సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎంను కలిసి అవార్డు, ప్రశంసాపత్రం అందజేశారు మంత్రి గుమ్మడి సంధ్యారాణి, జీసీసీ ఎండీ కల్పన కుమారి. అరకు కాఫీ ద్వారా జాతీయ స్థాయిలో బిజినెస్ లైన్ ఛేంజ్ మేకర్ అవార్డు దక్కించుకుంది గిరిజన సహకార సంస్థ. అరకు వ్యాలీ కాఫీకి ఫైనాన్షియల్ ట్రాన్స్‌ఫర్మేషన్ విభాగంలో అవార్డు దక్కడంపై గిరిజన శాఖ మంత్రి సంధ్యారాణి, జీసీసీ ఎండీ కల్పన కుమారిని ప్రశంసించారు ముఖ్యమంత్రి చంద్రబాబు.
బిజినెస్ లైన్ నుంచి స్వీకరించిన అవార్డును, ప్రశంసా పత్రాన్ని పరిశీలించారు సీఎం చంద్రబాబు. ఏజెన్సీ ప్రాంతంలో సేంద్రీయ విధానంలో సాగవుతున్న అరకు కాఫీ స్వచ్ఛత, సువాసనలతోపాటు ప్రత్యేక రుచిని కలిగి ఉందని సీఎం చెప్పుకొచ్చారు. ఈ విశిష్టత కారణంగా అరకు కాఫీకి నాణ్యమైన బ్రాండ్ అనే పేరు వచ్చిందని తెలిపారు. కాఫీ సాగు ద్వారా అరకులోని గిరిజనుల జీవన శైలిలో మార్పు వచ్చిందని వెల్లడించారు. ఇటీవల జీసీసీ - టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ మధ్య కుదిరిన అవగాహన ఒప్పందంతో దేశంలో తొలిసారిగా ఆర్గానిక్ సాల్యూబుల్ కాఫీ ఉత్పత్తి కానుందని వివరించారు సీఎం చంద్రబాబు. నర్శిపట్నం సమీపంలోని మాకవరపాలెం గ్రామంలో ఆధునిక సాంకేతికతతో కూడిన ఇంటిగ్రేటెడ్ కాఫీ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటైందని తెలిపారు. తద్వారా విలువ ఆధారిత ఉత్పత్తిగా బీన్ టు కప్ మోడల్ అభివృద్ధి కానుందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
ఏపీ కేబినెట్ భేటీ ప్రారంభం.. 21 అంశాలపై చర్చ
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీలో భారీ వర్షాలు
Read Latest AP News And Telugu News