Special Trains: దసరా, దీపావళికి ప్రత్యేక రైళ్లు.. ఎక్కడినుంచి ఎక్కడివరకంటే..
ABN , Publish Date - Aug 23 , 2025 | 01:09 PM
ప్రయాణికుల రద్దీ, దసరా, దీపావళి పండుగలను పురస్కరించుకుని ప్రత్యేక వీక్లీ రైళ్లను నడపనున్నట్టు రైల్వే అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. చర్లపల్లి-తిరుపతి (07011) ప్రత్యేక వీక్లీ రైలు సెప్టెంబరు 5 నుంచి 26 వరకూ శుక్రవారాలలో, దీని తిరుగు ప్రయాణపు రైలు (07012) సెప్టెంబరు 6 నుంచి 27 వరకూ శనివారాలలో నడపనున్నట్లు తెలియజేశారు.
గుంతకల్లు(అనంతపురం): ప్రయాణికుల రద్దీ, దసరా, దీపావళి పండుగలను పురస్కరించుకుని ప్రత్యేక వీక్లీ రైళ్లను నడపనున్నట్టు రైల్వే అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. చర్లపల్లి-తిరుపతి (07011) ప్రత్యేక వీక్లీ రైలు సెప్టెంబరు 5 నుంచి 26 వరకూ శుక్రవారాలలో, దీని తిరుగు ప్రయాణపు రైలు (07012) సెప్టెంబరు 6 నుంచి 27 వరకూ శనివారాలలో నడపనున్నట్లు తెలియజేశారు. ఈ రైలు మల్కాజ్‌గిరి, కాచిగూడ, ఉందానగర్, షాద్‌నగర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్, వనపర్తి రోడ్, గద్వాల, కర్నూలు సిటీ, డోన్, గుత్తి, తాడిపత్రి, యర్రగుంట్ల, కడప, ఒంటిమిట్ట, రాజంపేట, రేణిగుంట, స్టేషన్ల మీదుగా వెళ్తుందన్నారు.
తిరుపతి-హిసర్ ప్రత్యేక రైలు (07717) అక్టోబరు 1 నుంచి నవంబరు 26 వరకూ బుధవారాలలో, దీని తిరుగు ప్రయాణపు రైలు (07718)ను ఈ నెల అక్టోబరు 5 నుంచి నవంబరు 30 వరకూ ఆదివారాలలో నడుపుతా మన్నారు. ఈ రైలు రేణిగుంట, రాజంపేట, కడప, యర్రగుంట్ల, తాడిపత్రి, గుత్తి, గుంతకల్లు, డోన్, కర్నూలు సిటీ, గద్వాల, మహబూబ్‌నగర్, జడ్చర్ల, కాచిగూడ(Kachiguda), మల్కాజ్‌గిరి, మేడ్చల్, కామారెడ్డి, నిజామాబాద్, బాసర, ధర్మబాద్, ముడ్‌ఖేడ్, నాందేడ్, పూర్ణా, బస్మట్, హింగోళి, వాసిం, అకోలా, షేగావ్, మల్కాపూర్, భుస్వాల్, జల్‌గావ్, ధరన్‌గావ్, అమల్నేర్, నందుర్బార్, ఉడ్నా, వడోదర, రత్లం, మాండ్‌సొర్, నీమచ్, చిత్తౌర్‌ఘర్, భిల్వారా,
బిజయ్‌నగర్, నాసిర్‌బాద్, అజ్మీర్, క్రిష్ణాఘర్, పులేరా, రింగస్, సికర్, నవాల్‌ఘర్, ఝుంజును, చిరావా, లోహారు, సదుల్‌పూర్ స్టేషన్ల మీదుగా వెళ్తుందన్నారు. నాందేడ్-ధర్మవరం (07189) ప్రత్యేక రైలు సెప్టెంబరు 5 నుంచి 26 వరకూ శుక్రవారాలలో, దీని తిరుగు ప్రయాణపు రైలు (07190) సెప్టెంబరు 7 నుంచి 28 వరకూ ఆదివారాలలో నడుస్తుందన్నారు. ఈ రైలు ముఢ్ఖేడ్, ధర్మాబాద్, బాసర, నిజామాబాద్, ఆర్మూర్, లింగంపేట, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జమ్మికుంట, వరంగల్లు, మహబూబాబాద్, డోర్నకల్లు, ఖమ్మం, మధిర, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట(Renigunta), తిరుపతి, పాకాల, పీలేరు, మదనపల్లి, కదిరి స్టేషన్ల మీదుగా ధర్మవరం చేరుతుందన్నారు.

బెంగళూరు-బీదర్ ప్రత్యేక రైలు (06549) ఈనెల 26న, దీని తిరుగు ప్రయాణపు రైలు (06550) ఈ నెల 27న, బెంగళూరు-బీదర్ (06530) ప్రత్యేక రైలు సెప్టెంబరు 5 నుంచి 28 వరకూ శుక్ర, ఆదివారాలలో, దీని తిరుగు ప్రయాణపు రైలు (06540) సెప్టెంబరు 6 నుంచి 29 వరకూ శని, సోమవారాలలో నడుపుతున్నట్లు తెలియజేశారు. ఈ రైళ్లు యల్హంక, హిందూపురం, ధర్మవరం, అనంతపురం, గుంతకల్లు, ఆదోని, మంత్రాలయం రోడ్, రాయచూరు, క్రిష్ణా, యాదగిరి, వాడి, షాహాబాద్, కలబురగి, హోమ్నాబాద్ స్టేషన్ల మీదుగా నడుస్తాయన్నారు.
యశ్వంతపూర్-ధన్‌బాద్ (06563) ప్రత్యేక రైలు ఈ నెల 23 నుంచి డిసెంబరు 27 వరకూ శనివారం, దీని తిరుగు ప్రయాణపు రైలు (06564) ఈ నెల 25 నుంచి డిసెంబరు 29 వరకూ నడపనున్నట్లు వివరించారు. ఈ రైలు యల్హంక, ధర్మవరం, అనంతపురం, గుత్తి, డోన్, కర్నూలు సిటీ, మహబూబ్‌నగర్, కాచిగూడ, ఖాజీపేట్, రామగుండం, బాలార్షా, నాగపూర్, ఇటార్సి, నరసింగ్‌పూర్, మదన్‌మహల్, కట్ని, సాట్నా, ప్రయాగరాజ్, మీర్జాపూర్, దీన్‌దయాళ్ ఉపాధ్యాయ స్టేషన్, బబువా రోడ్, ససరం, అనుగ్రహ నారాయణ్, గయ, కోడేర్మ, హజారీబాగ్, పరశ్‌నాథ్, గోమహ్ స్టేషన్ల మీదుగా వెళ్తుందన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మళ్లీ తగ్గిన బంగారం ధరలు.. నేటి రేట్స్ ఎలా ఉన్నాయంటే..
Read Latest Telangana News and National News