Share News

JC Prabhakar Reddy: జేసీకి షాక్.. చర్యలు తీసుకుంటామన్న ఎస్పీ..

ABN , Publish Date - Oct 22 , 2025 | 07:19 PM

ఏఎస్పీ రోహిత్‌పై టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై జిల్లా ఎస్పీ జగదీష్‌ స్పందించారు. ప్రభాకర్‌రెడ్డిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. నిజాయితీగా పనిచేసే అధికారిపై బెదిరింపు ధోరణి తగదని హితవుపలికారు.

JC Prabhakar Reddy: జేసీకి షాక్.. చర్యలు తీసుకుంటామన్న ఎస్పీ..

అనంతపురం: ఏఎస్పీ రోహిత్‌పై టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై జిల్లా ఎస్పీ జగదీష్‌ స్పందించారు. ప్రభాకర్‌రెడ్డిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. నిజాయితీగా పనిచేసే అధికారిపై బెదిరింపు ధోరణి తగదని హితవుపలికారు. ఇలా బెదిరింపు ధోరణితో మాట్లాడటం చట్టరీత్యా నేరమన్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి గన్‌ లైసెన్స్‌ పైనా లీగల్‌ ప్రొసీజర్‌ ప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్పీ జగదీష్‌ పేర్కొన్నారు.


పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో ఏఎస్పీ రోహిత్‌పై జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన తెలిసిందే. ఏఎస్పీ రోహిత్‌కు చదువు మాత్రమే ఉందని.. బుద్ధి, జ్ఞానం లేదంటూ జేసీ విమర్శించారు. ఈ ఉద్యోగానికి రోహిత్ కుమార్ చౌదరి అనర్హుడని స్పష్టం చేశారు. ఏఎస్పీ కార్యాలయం ముందు తాను నిరసన చేస్తే.. రోహిత్ బయటకు రాకుండా ఇంట్లోనే దాక్కున్నాడని ఆరోపించారు. తాడిపత్రిలో ఎక్కడైనా ఘర్షణలు జరిగి రాళ్లు రువ్వుకుంటే ఈ ఏఎస్పీ భయపడి పారిపోతున్నారని జేసీ ప్రభాకర్ రెడ్డి విమర్శించారు.


ఇవి కూడా చదవండి..

అయ్యప్ప సేవలో ద్రౌపది ముర్ము.. శబరిమలను దర్శించుకున్న తొలి రాష్ట్రపతి

వైట్‌హౌస్‌లో దీపావళి వేడుకలు.. ప్రధాని మోదీ గురించి ట్రంప్ ఏమన్నారంటే..

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయం

Updated Date - Oct 22 , 2025 | 07:30 PM